మతం కాదు మానవత్వమే ముఖ్యం;- ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్:-విశాఖపట్నం
 పరమాత్ముని ఆనతితో
పుడమి పై జంయించిన
ప్రజలంతా  ఏకోదరులులా
పగలు ,ప్రతీకారాలు లేక
ప్రేమానురాగాలతో ఉండాలని
ప్రేమతో బాల్యంలో  పెంచిన మాతృమూర్తి చెప్పినట్లు
ఊహించిన  నేను
నేటి సమాజాన జరిగే
కులమతాబేధాలు
వర్ణవివక్షతలు
పేద గొప్ప తారతమ్యాలు 
ఉగ్రవాదుల విధ్వంసక చర్యలు
యుద్ధాలలో నరమేథాలు
శరీరం బుద్బుధమని తెలిసినా
ఎన్నో ఎన్నెన్నో సంఘటనలు చూసి
శాంతి అహింసలే సాధనాలుగా
స్వాతంత్ర్య సముపార్జన చేసిన జాతిపిత మహాత్మాగాంధీ చెప్పినట్లు
అర్ధరాత్రి స్త్రీ నడివీధిలో ఒంటరిగా నడచినపుడే అసలయున స్వాతంత్య్రమన్నది
నెరవేరాలన్న ధ్యాసతో
నలుబది ఏండ్లయి చదువుతో బాటు సంస్కారాన్ని ఆచార్యునిగా బోధిస్తూ కొంత మేరకు
నా ఊహ కు సారూప్యత నిచ్చినా
"గతకాలమే మేలు వచ్చు కాలం కంటెన్" అన్న నన్నయ్య చెప్పినది నిజమనిపిస్తోంది
'కరోనా' వల్ల గుణపాఠం నేర్చుకుని
ప్రజలంతా సమాజశ్రేయస్సు కొరకు పాటుపడి
మానవత్వమే మాధవత్వముగా జీవించాలన్న నా ఊహ
భవిష్యత్తులో నెరవేరునని
తప్పక సుపరిపాలనతో
సమాజాభివృద్ధి జరుగుతుందని ఆశీస్తున్నా ఆకాంక్షిస్తున్నా
"లోకా సమస్తా సుఖినో భవంతు " అన్నది అందరి మనసులో ఉండాలని
భగవంతుని ప్రార్థిస్తున్నాను..!!
........................

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం