.భరతమాత సిగలో కలికితురాయి;- డా.చీదెళ్ళ  సీతాలక్ష్మి9490367383
ఎండ లేదు వాన లేదు
మంచు చలిలో గడ్డకట్టుకుపోయే కాయాలు
కొండలు కోనలే నివాస భవనాలు
తిండికొఱకు వెంపర్లాట లేదు
రుచులు మరచిన జిహ్వ
రాత్రి పగలు ఓకే తీరు
నిద్ర ఎరుగని కన్ను
ఎప్పుడూ డేగ చూపులే
సుఖం అంటే ఆమడ దూరం!!

అన్నీ మరచి తనను తాను మరచి
భార్యాపిల్లలకు దూరమై
కన్నతల్లిదండ్రుల కన్నుల్లో వత్తులై
ఏమీ ఆశించని నిస్వార్థ జీవులు
శత్రువు పాలిట సింహ స్వప్నాలు!!

బ్రతుకంతా దేశం కోసమే
దేశం కోసమే జీవితం
దేశ రక్షణే ప్రధాన ధ్యేయం
పగవానికి చిక్కి శరీరం 
గాయాల పాలై 
కుళ్ల బొడుస్తున్నా
రహస్యాన్ని కాపాడిన వైనం!!

ధైర్యం వారి సొత్తు
దేశ భద్రతే వారి ఎత్తు
ఉన్నత మహోన్నత శిఖరం
భారతావని సిగపూవులు వీర సైనికులు
భారతావని సిగలో కాంతులీనుతున్న కలికితురాయిలు
అభినందనీయులే..!!

---------------------


కామెంట్‌లు