సుప్రభాత కవిత ; -బృంద
కాంతి కలశం ఒలికించిన
కాంచన కిరణాలు ప్రసరించిన
కణకణమూ కనకమై భాసించే
కమనీయ దృశ్యం కనులకు విందేకదా!

పసిడి పంటను ప్రసవించే
పుడమితల్లికి ప్రభాకరుడు
బహుకరించిన బహుమానం
సిరివెలుగులలో మెరిసిపోయే
మేదినిదెంత పుణ్యమో కదా!

ప్రభవించు తరుణాన
ప్రసరించు కిరణాల
ప్రాభవము చూపాలని
గగనమే యవనికగా రంగుల తెరతీసిన నింగిదెంత అందమో కదా!

మనసు నిండిన తృప్తి
మనుగడలో ఉండిపోతే
మరపురాని అనుభూతులు
మాయక మురిపించు
బ్రతుకెంత ధన్యమో కదా!

మాటలతో  మమకారాలు
మనసులకు చేరవేసే
మధురభావాల సుమాలను
మాలలుగా గూర్చి కానుకనిచ్చే
భాష దెంత సహకారమో కదా!

తరగని  దూరాలనైనా
కరిగించే కమ్మని ఆశలు 
కల్పించే కదిలే కాలపు
కదలికల క్రమంలో వచ్చే 
రేపన్నపదమెంత అపురూపమో కదా!

తనివి తీర్చే తెలివెలుగుల 
కాంతులకు

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు