వైవిధ్యం;; - సాయి వేమన్ దొంతి రెడ్డి,కుంచనపల్లి.
 మనం తింటే తిని లేకుంటే పస్టులు నుండి మన బాధల్ని పంచుకొని చిన్నజీవి గొప్పదా నీచమైనదా ప్రశ్నార్థకమే శతకకాడలు చెప్పినట్లు చెప్పు తినే కుక్క చెరకు తీపి ఎరుగునా బంగారు సింహాసనం మీద శునకం ను కూర్చోబెట్టిన దాని తత్వం మారుతుందా మానవమాత్రులలో స్వార్థపూరితంగా మారి ఆ స్వర్ణాన్ని కాజేస్తుందా దానిని దాచుకుని పిల్లలకు పంచుతుందా అసలే  బంగారం కదా దాన్ని వదులుతుందా అసలే దానికి దొంగ బుద్ధి కదా అని వ్యాఖ్యానించే ప్రబుద్ధులు ఈ భూమి మీద అనేకమంది ఉన్నారు కానీ సుమతీ శతక కారులు సుమతి అంటేనే మంచి బుద్ధి కలవాడు అని కదా అర్థం మనదేశంలో మంచివారిని చెడ్డవారిని చూసి వారి చిరునామా తెలుసుకుని రమ్మంటే ఎక్కడా కనిపించడం లేదని చెప్పారు.ధర్మరాజు వచ్చి నాకు ఒక చెడ్డవాడు ఒక్కరు కూడా కనిపించడం లేదని చెప్పినట్లు వ్యాసల వారు పేర్కొన్నారు 14 సంవత్సరాల అవగాహనలో మా జిప్సీ అన్నీ మంచి పనులు చేసింది తప్ప ఏ ఒక్క చెడ్డ పని చేయలేదు మాలమూత్ర విసర్జన కూడా నిర్ణీత స్థలంలో చేసేది ఎంత విలువైన వస్తువులు ఉన్నా వాటిని దొంగల బారి నుంచి రక్షించడానికి సిద్ధపడేది దానికోసం నిర్దేశించిన పళ్ళెంలో వడ్డిస్తే గాని కడుపోరా ఆరగిoచేది కాదు అలాంటి అమృత తత్వాన్ని సుమతీ శతక కారులు కూడా గ్రహించి ఉండి ఉండాలి అందుకే అలా ప్రయోగించాడు దాని గుణం ఏమిటి దేని ప్రాతిపదికపై కుక్క జీవితం గడిపింది నమ్మకం విశ్వాసం కృతజ్ఞతతో ముడిపడి ఉన్నది కనుక  మహాభారతంలో ధర్మరాజు తన పెద్ద తమ్ముడు సింహబలుడైనా గమనించలేదు.రెండు చేతుల ఉపయోగించడం తెలిసిన తమ్ముడు అర్జునుడిని కూడా లెక్క చేయలేదు అతి సుకుమారుడైన నకుల సహదేవులను కానీ తన వెంట వచ్చిన కుక్కను మాత్రం వదలలేదు కారణం తన వెన్నుపూస తన ఆలోచన తన జీవిత విశ్వాసం కాలానికి ప్రతీక కాలభైరవుడు అలాంటి అత్యున్నత జీవితాలు లేకుండా ఉంటే స్వర్గానికి రాను రాను అని కూర్చున్నాడు అప్పుడు అంత సమదర్శి లోకాలను కాచినవాడు యమధర్మరాజు కూడా  ఆ విశ్వాసానికి మురిసి స్వర్గలోకానికి పంపించాడు అంతటి ఉన్నత గంభీర చులకన చేసి మాట్లాడడం మన అజ్ఞానానికి పరాకాష్ట  చెప్పు తిని ఆరగిoచుకుంటుంది ఆచరణలో చూపుతుంది కనుక ఆచరణలో ఆ మాధుర్యాన్ని ఆ తీపిని చూపే కుక్కను చెప్పు తినెడు కుక్క అని మనం చులకన చేసి మాట్లాడితే  చులకన భావంతో చూసిన  మీ అభిప్రాయం చెప్పమని అడిగితే తప్పకుండా కుక్క అని చెప్తా.
======================================
సమన్వయం ; డా.. నీలం స్వాతి 

కామెంట్‌లు