చిన్న పిల్లలకు హాయిగా నిద్రపోనివ్వండి;- .. డాక్టర్ జాదవ్ అనిల్ కుమార్

 చిన్న పిల్లలకు హాయిగా నిద్రపోనివ్వాలని ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ జాదవ్ అనిల్ కుమార్ తెలిపారు. 
నిద్ర చిన్నపిల్లల ఎదుగుదలకు  ప్రభావితం చేస్తుంది. 
పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. 
వారి మేధా శక్తిని పెంచుతుంది. 
పిల్లల మానసిక ,శారీరక వికాసానికి నిద్ర దోహదపడుతుంది. 
పిల్లలను పరిశుభ్రమైన పడుక గదిలో పడుకో పెట్టాలి. 
పరిశుభ్రమైన పడకగది పిల్లలను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతుంది. పిల్లలు పడుకునే గదిలో టీవీల వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు ఉండకుండా చూడాలి. 
పిల్లలు నిద్ర పోయేముందు కథలు చెప్పాలి. 
పిల్లలు కథలు వింటూ చక్కగా నిద్రపోతారు. 
పిల్లలకు జింక్ ఫుడ్ ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 
జింక్ ఫుడ్ పిల్లల నిద్రను భంగం చేస్తుంది. 
పిల్లల రాత్రి భోజనంలో పప్పు ధాన్యాలు ఉండడం పిల్లలకు మేలు చేస్తుంది.
కామెంట్‌లు