ప్రావీణ్యం;- కె. శ్రావ్య -తొమ్మిదవ తరగతి -జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హవేలీ ఘనపూర్ -మెదక్ జిల్లా
 అనగనగా నర్సాయిపల్లి అనే గ్రామంలో సీత, రాము అనే దంపతులు ఉండేవారు. వాళ్లకు చందు, కృష్ణ అనే కుమారులు ఉన్నారు. కుమారులు ఇద్దరు బడికి వెళ్లి చదువుకోవడం తల్లిదండ్రులు సంతోషపడేవారు. 
               ఒకరోజు సెలవు రోజున తల్లిదండ్రులతో కుమారులు పొలం వద్దకు వెళ్లారు. పొలం వద్దకు వెళ్లే సమయంలో తల్లిదండ్రులు చదువుకోలేదని, కాస్త వెటకారంగా చందు, కృష్ణ లు మాట్లాడారు. పొలం దగ్గర మామిడి చెట్టు పైన రెండు మామిడికాయలు ఉన్నాయి. వాటిని చూసి తెంపడానికి చందు, కృష్ణ లు ఎంతగానో కష్టపడ్డారు. ఎంత ప్రయత్నం చేసిన ఆ రెండు మామిడికాయలు తెంపలేకపోయారు. అంతలోనే అక్కడికి వచ్చిన తండ్రి రాము చాకచక్యంగా ఒక్క క్షణంలో మామిడి చెట్టు పైకి ఎక్కి పైన ఉన్న రెండు మామిడికాయలను తెంపాడు. 
               తండ్రి మామిడికాయలు తెంపిన పనితీరు చూసి,  కుమారులు ఇద్దరు ఆనందించారు. చదువు వల్లనే కాదు ఎందులోనైనా ప్రావీణ్యత పొందితే విజయం సాధించవచ్చునని కుమారులిద్దరు తెలుసుకున్నారు. తాము తప్పుగా మాట్లాడినందుకు తల్లిదండ్రులను క్షమించమన్నారు. ఇద్దరు చక్కగా చదువుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చారు. 

కామెంట్‌లు