బుద్ధుని మొదటి ప్రవచనం;- చిరసాని శైలూషి,నెల్లూరు.

 భిక్షను ఆరగించడానికి అనువైన చోటు కోసం చూస్తున్న ఆ పరివ్రాజనికి ఉత్పత్తిస్స ఇదే సరైన సమయం ఆనుకుని ఆయనకు ఆసనాన్ని అమర్చి తను వద్దనున్న నీళ్లను అందివ్వగా భిక్షను ఆరగించాడు తర్వాత ఆయనకు ఉత్పత్తిస్స సపర్యాలు చేసి నమస్కరించి తను తెలుసుకోవాలనుకున్న విషయాలు అడిగాడు నాకు తెలిసింది చాలా తక్కువ నేను నీకు ధర్మాన్ని పూర్తిగా వివరించలేను అన్నాడు గౌరవనీయ నా పేరు ఉత్పత్తిస్స మీకు తెలిసిన ధర్మాన్ని దయచేసి నాకు బోధించండి కనీసం నాకు ధర్మసారాన్ని వివరించడం చాలు అని వేడుకున్నాడు ఉత్పత్తిస్స, ఉత్పత్తిస్స ధర్మం పట్ల గల ఆసక్తిని గమనించిన అర్హoతుడు తాను బుద్ధిని వద్ద విన్న ధర్మo యొక్క సారమైన కార్యకారణ సిద్ధాంతాన్ని తన మాటలలో సోదాహరణంగా చెప్పారు.హేతుబద్ధమై జన్మించే వాటికన్నిటికీ కారణాలతో పాటు వాటిని నిరోధించే మార్గాలను మహా శ్రమనుడైన తథాగతుడు వివరించాడని అతడు ఎవరో కాదు బుద్ధుడని ఆయన బోధించిన ధర్మాన్ని స్వీకరించి కొద్ది కాలమే అయినా నాకు తెలిసిన బుద్ధుని ధర్మసారాన్ని నీకు తెలియజేస్తున్నాను మహనీయుడైన ఆ బుద్ధుని అనుసరించి అందుకే నేను పరిత్యాజిoచాను అని వివరించాడు అస్సజీ ధర్మ సారాన్ని విన్న ఉపతిస్స కు సత్యం ఎరుక అయ్యింది అతడు సోతాపత్తి చేరుకున్నాడు అంతటి మహోన్నత ధర్మాన్ని ఆ ధర్మాన్ని చెప్పింది బుద్ధుడు అన్న విషయాన్ని చెప్పినందుకు ఆయనకు కృతజ్ఞతలు చెప్పాడు ఉపతిస్స అంతకు ముందు అనుకున్నట్లుగా ఉపతిస్స తాను విన్నదంతా కోలిక కు వివరించగా అతడు కూడా సోతాపన్నుడైనాడు తాను తెలుసుకున్న సత్యాన్ని ఎరుక పరచి సంజయ్ ని కూడా ధర్మపదగామి గా చేయాలనుకుని సంజయని సమీపించి తన అనుభవాన్ని బుద్ధ సారాన్ని వివరించినా అతని వద్ద నుంచి ఏమాత్రం స్పందన లేకపోగా ఆసక్తి కూడా కనిపించలేదు.కానీ సంజయుని అనుచరులు సంతృప్తులై ఉపతిస్స కొలిక లను అనుసరించగా బుద్ధ భగవానుని దర్శించటానికి ఆయన విశ్రాంతి తీసుకుంటున్న వేలువన గ్రామానికి వెళ్లారు ఉపతిస్స కోలికల విన్నపం మేరకు బుద్ధుడు వారిని సంఘంలో చేర్చుకున్నాడు వారితో పాటు వారిని అనుసరించి వచ్చిన సంజయిని శిష్యులు కూడా సంఘంలో చేరారు ఈ సంఘటన 15 రోజులు తర్వాత బుద్ధుడు మరియు దీర్గనకుల నే పరివ్రాజకునుకి ధర్మ ఉపదేశంలో భాగంగా వివరిస్తున్న  వేదనా పరిగ్రహ సూత్రాన్ని విన్న ఉపతిస్స(సారి పుత్రుడు) అర్హు0తుడు అయినాడు ఆరోజు సాయంకాలం భిక్షుగణ సమావేశాన్ని ఏర్పాటు చేసి సంఘలో ప్రథమ శిష్యుని స్థానాన్ని ఉపతస్స కు రెండవ స్థానాన్ని కోలికకు ప్రదానం చేసినట్టు ప్రకటించాడు  బుద్ధుడు
======================================
సమన్వయం ; డా.. నీలం స్వాతి 
కామెంట్‌లు