దైవభక్తి కన్నా. దేశభక్తి గొప్పది ; ; -తాండూరు డి.ఎస్.పి k. బాలకృష్ణారెడ్డి;-వెంకట్ . మొలక ప్రతినిధి

 ఖంజాపూర్ గేటు సమీపంలో ఉన్న తెలంగాణ గురుకుల బాలికల పాఠశాలలో   శుక్రవారం ఘనంగా కార్గిల్ విజయ్ దివస్ జరిపారు
ఈ కార్యక్రమంలో తాండూర్ డి.ఎస్.పి కే బాలకృష్ణారెడ్డి  ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ 
 భారత దేశ రక్షణ కోసం 365 రోజులు 24 గంటలు కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి సైనికుల యొక్క సేవలు అమోఘం 
కార్గిల్ యుద్ధంలో ఎందరో  సైనికులు వీరమరణం పొందారు  మైనస్ 40 డిగ్రీల వాతావరణం లో కూడా  సియాచిన్ లాంటి ప్రదేశాలలో పని చేస్తున్నారంటే అది ప్రపంచంలో అతి శీతలమైన భూభాగమని మనము సినిమాలో ఉన్న హీరోలే హీరోలనుకుంటాము కానీ అసలైనటువంటి నిజమైనటువంటి దేశ రక్షణ కోసం కృషి చేస్తున్నటువంటి సైనికులు నిజమైనటువంటి హీరోలు అన్నారు వారిని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో లాల్ బహదూర్ శాస్త్రి అన్నట్టు జై జవాన్ జై కిసాన్ ఇటు రైతుకు అటు సిపాయికి ఎప్పుడు కూడా సెల్యూట్ చేయాలంటూ విద్యార్థులకు వివరించారు. 
ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కన్వీనర్ కవయిత్రి  మొల్ల కళావేదిక ఫౌండర్ అధ్యక్షులు
KVM వెంకట్ పాల్గొని మాట్లాడుతూ 
  దేశ సరిహద్దుల్లో రాత్రి పగలనకా కంటిమీద కునుకు లేకుండా భారత్ కు రక్షకునిగా ఉంటున్న సైనికులకు వారందరికీ అభినందనల తెలుపుతూ కార్గిల్లో అమరులైన వీర జవాన్లకు సెల్యూట్ చేసే కార్యక్రమం ప్రతి సంవత్సరం ఆనవాయితుగా 12 సంవత్సరాల నుండి కొనసాగుతుందని  దేశ రక్షణ కోసం ప్రతి ఒక్కరు   స్ఫూర్తి తీసుకోవాలన్నారు పుష్పము ఆడవారి జడలో ఉండాలని దేవుని మెడలో ఉండాలని కోరుకోదంట దేశ రక్షణ కోసం వెళుతున్నటువంటి వీర సైనికుల వెళ్లి మార్గంలో పడవ ఇస్తే వారి కాళ్ళ పాదాల కింద నగిలిపోయినప్పుడు నా జన్మ సార్థకత అవుతుంది అనే విధంగా పుష్పం ఎలా కోరుకుంటుందో ప్రతి ఒక్కరు దేశ రక్షణ కోసం ప్రతి పౌరుడు ముందుకు రావాలన్నారు 
ఈ కార్యక్రమంలో భరతమాత వైశ్య ధారణ  విద్యార్థి లు 
దేశ రక్షణలో భీకర పోరాటం చేసిన సన్నివేశాలు 
పాటలు 
ఉపన్యాసాలు 
అందరిని అలరించాయి 
వ్యాసరచన డ్రాయింగ్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు 
డి.ఎస్.పి బాలకృష్ణారెడ్డి 
పోగ్రామ్ కన్వీనర్ 
కేవీఎం వెంకట్ 
ఇన్చార్జి ప్రిన్సిపల్ ప్రవీణ 
ఉపాధ్యాయుల చేతుల మీదుగా అందజేశారు 
ఈ కార్యక్రమంలో ఏపీటి pet  విద్యార్థులు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు
కామెంట్‌లు