ఆగస్టు 15 శుభోదయం ;- మొర్రి గోపి -కవిటి-శ్రీకాకుళం జిల్లా -8897882202
తంత్రాలకు ఎదురొడ్డి 
పర తంత్రం పై పోరు 
స్వేచ్ఛ వాయువులకై 
త్యాగాల జోరు 

దురాచారాలకు ధీటుగా 
అసమానతలపై ఘాటుగా 
బానిసత్వానికి వ్యతిరేకంగా 
పోరాటంసల్పారు ఏకమై 

బ్రహ్మ సమాజం స్థాపనతో 
రాజా రామ్మోహన్ రాయ్ 
వివేకవర్ధిని పత్రికతో 
కందుకూరి వీరేశలింగం 
సమ సమాజ నిర్మాణానికి 
నిరంతర సాధనా ప్రయత్నం 

 సిపాయిల తిరుగుబాటు
కంపెనీ పాలనకు అంతం 
భారత ప్రథమ స్వతంత్ర సమరం 
ఝాన్సీ లక్ష్మీభాయి స్ఫూర్తి అమరం

విజ్ఞాపన వినతి అభ్యర్థనలే 
మితవాదుల సమయస్ఫూర్తి 
బ్రిటిష్ పాలన అంతముకు 
పోరాటమే లక్ష్యమై అతివాదుల ఆర్తి 

లాల్ బాల్ పాల్ త్రయం 
ఎదురొడ్డి నిలిచి పోరాడిన తీరు 
భగత్ సింగ్ ఆజాదుల 
త్యాగనిరతి తెగువకు శ్రీకారం 

అహింసా సత్యాగ్రహ మార్గంలో 
జాతిపిత గాంధీజీ నడిపించిన ఉద్యమం 
ఏకతాటిపై భరతావనిని నడిపించిన వైనo 
సహాయనిరాకరణం
క్విట్ ఇండియా ఉద్యమం 
బ్రిటిష్ వెన్నులో భయం భయం 
భారత స్వాతంత్ర ఉద్యమం 
ఆగస్టు 15 న అందించే శుభోదయం
****


కామెంట్‌లు