1మట్టిపాత్రలు! అచ్యుతుని రాజ్యశ్రీ

 మన పూర్వీకులు పూర్వం వంటింటి వైపు బాగా శ్రద్ధ పెట్టేవారు.మడిపేరుతో శుచి శుభ్రత దైవ స్మరణ తో వంట చేయడం ముఖ్యం గా మట్టి పాత్రలు వాడటం తో ఆరోగ్యం గా ఉండేవారు.వైదికకాలంలో‌‌యజ్ఞశాలలో మూడు రకాల అగ్నులు వెలుగుతుండేవి.మొదటిది గార్హపత్య అగ్ని రెండోది ఆహవనీయాగ్ని అంటే దేవతలనాహ్వానిస్తూ తూర్పు దిశగా అగ్ని మూడోది
దక్షిణాగ్ని ని పూర్వీకులను ఆహ్వానిస్తూ వెలిగించి పూజించేవారు.గృహస్థుకార్యకలాపాలన్నీ గార్హపత్య
అగ్ని తో నిర్వహించే వారు.దానిపై వంట చేసేవారు.
2 పురాణాలలో శివుని భార్య అన్నపూర్ణాదేవి వంటింటికి అధిదేవత.ఆమెనే కాశీ అన్నపూర్ణ గా కొలుస్తారు.లక్ష్మి అన్న దేవత.అలా దైవ స్వరూపంగా భావించి వంటకాలు అన్నంని ఇష్టం వచ్చినట్టు నిర్లక్ష్యంగా కోడి కెలికి నట్లు తినేవారు కాదు.అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మెతుకు కింద పడకుండా మౌనం గా ఆస్వాదిస్తూ భగవన్నామ స్మరణ మనసులో చేస్తూ తినేవారు.అందుకే మౌనం పాటించాలి.పశువులు కూడా నెమ్మదిగా నిశ్చలంగా నమలటం చూస్తాం.మనిషిని కూడా పశువనే భావించారు.ఇక వంట పాత్రలు ఎంత బాగా ఆలోచించి తయారు చేసేవారో అనిపిస్తుంది.కంచంని పై అంచులు ఉండేలా కొద్దిగా వంపుతో తరళ పదార్థాలు కిందకి కారకుండా తయారు చేసేవారు.
హరప్పా నాగరికత లో ఇలాంటి కంచాలు మట్టి మూకుళ్లు బైట పడ్డాయి.సుశృతసంహితలో వండిన వంటకాలు ఎక్కడెక్కడ కంచంలో వడ్డించాలో వివరించారు.
3. వంటకాలు కుండల్లో ఉడికించే వారు.అరిటాకుబాదమాకు మోదుగ ఆకులవిస్తరిలో 
వడ్డించేవారు.వీటిని పత్రావళి‌ పత్తల్ అనేవారు.పగిలిన చిరిగిన మృణ్మయకంచాల్లో తినడం అవమానం గా భావిస్తారు.అలాగే కొంచెం పక్కనే మంచినీళ్ళచెంబు గ్లాసు పెట్టేవారు.ఇది  గ్రీసు దేశపు ఎంఫోరా ఫారశీ సురాహీ కన్నా పూర్తిగా భిన్నంగా ఉంటుంది.ఇవి పొడుగ్గా వెడల్పు తక్కువగా ఉంటాయి.లోటా అనే పాత్ర చెంబు తో పూర్వం కాళ్ళు చేతులు కడుక్కోవడం కోసం వాడేవారు.ఇది నేలపై స్థిరంగా కదలకుండా ఉంటుంది.కలశంగా వెండి రాగి చెంబులు వాడతారు.ఇక వంటింటి లో కత్తి  పీటలుండేవి. బెంగాలీలో‌  బోటీ ఒడియాలో 
పానికీ అని కూరలు కోసే కత్తులు వాడేవారు.కత్తిపీటపైభాగంలో కొబ్బరి తురుముకునే
వీలుండేది.వైదికకాలంనుంచి రకరకాల చెంచాలు గరిటలు వాడుక లో ఉన్నాయి.
4 అగ్నిలో ధారణీ అనే చెంచాతో నెయ్యి వేసే వారు.ఉడికించే వంటకాల్లో వేర్వేరు చెంచాలు గరిటెలు వాడేవారు.వేడి పాత్రలు పట్టుకోవటానికి 
బట్టని ఉపయోగిస్తారు.క్రమంగా పటకార చిమటా
రొట్టెలు కుంపటి పై కాల్చడానికి వాడేవారు.ఇప్పుడు 
ఇత్తడి రాగి కంచు ఇనుము అల్యూమినియం ఆఖరుగా స్టీల్ పాత్రలు తోమటం తేలికై వాడుతున్నాం.కాని భారీ వంటలకి ఇత్తడి గిన్నెలు 
ఇనుప బాండీలు వాడుక లో కి వచ్చాయి.

కామెంట్‌లు