స్ఫూర్తి ప్రదాతలు 31 సేకరణ అచ్యుతుని రాజ్యశ్రీ
 దివ్యాంగురాలైన ఏక్తాభ్యాణ్ హిస్సార్ నివాసి.డిస్కస్ త్రో లో బంగారు పతకం తో మెరిసింది. డాక్టర్ కావాలనే ఆశతో ఢిల్లీ వచ్చిన  ఆమె కోచింగ్ కెళ్ళేతొలిరోజే కాబ్ లో బయలుదేరింది.హర్యానా సరిహద్దుల్లో ట్రక్కు గుద్దుకోటం ఆమె స్పైనల్ కార్డ్ దెబ్బ తిని శరీరం కింద భాగం చచ్చుబడింది.    వీల్ ఛైర్ కే అంకితం ఐంది. ఆమె తో పయనిస్తున్న 6గురు విద్యార్థులు చనిపోయారు.ప్రమాదం జరిగిన ఏడాది తర్వాత  ఇంగ్లీషు ఆనర్స్  తోపాటు పోటీపరీక్షలకు తయారైంది. హర్యానా ప్రభుత్వం లోఆడిటర్ గా జాబ్ చేస్తూ  డిస్కస్ త్రో క్లబ్ త్రో లో శిక్షణ పొంది నేషనల్ మెడల్ ఏషియన్ గేమ్ లో గోల్డ్ మెడల్  భీం అవార్డు లభించాయి.  
ఆమెకు బ్యాంకులో ఉద్యోగం. కానీ  యు.పి.ఎస్.సి.పరీక్షల్లో 5సార్లు ఫెయిలైనా మడమతిప్పలేదు.ఆమె  పశ్చిమ బెంగాల్ కి చెందిన  పర్మితా మాలాకార్. బి.ఎస్సీ ఆనర్స్ పాసైన ఆమె  తన 30 వ ఏటనుంచే యు.పి.ఎస్సీ రాస్తూ 2022లో విజయంపొందింది. 
ఆసియా క్రీడలకు జ్యూరీ సభ్యురాలు శ్రీనగర్ కి చెందిన బిల్కిస్ మిర్.జలక్రీడల్లో పడవపందాల్లో తన 7వ ఏటనుంచే పాల్గొంటూ దాల్ సరస్సులో ప్రాక్టీసు ప్రారంభించింది. జాతీయ కోచ్ తొలి కాశ్మీర్ మహిళ.ఉగ్రవాదుల భయంఉన్నా సాధనతోనే అంతర్జాతీయ కీర్తి పొందారు.  
ఇక అంతరిక్షంలో అందలం ఎక్కిన తరుణుల గూర్చి క్లుప్తంగా తెలుసుకుందాం. 
ఆదిత్య ఎల్1 ప్రాజెక్ట్ డైరెక్టర్ నిగర్ షాజీ అంగారకగ్రహంపై రోవర్ నడిపేతొలి భారతీయురాలు అక్షతా కృష్ణమూర్తి  చంద్ర యాన్ 3 కి డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్  ఎం.వి.రూప  ఇదే ప్రాజెక్ట్ లో చిత్తూరు కి చెందిన కల్పన ఫ్రాన్స్ పురస్కారం పొందిన  వి.ఆర్.లలితాంబిక మహిళా మణులు🌹.

కామెంట్‌లు