స్ఫూర్తి ప్రదాతలు 32 అచ్యుతుని రాజ్యశ్రీ
 ఆచిన్నారిపేరు ఆకర్షణ! చాలా బాగుంది కదూ?అబ్దుల్ కలాం పెట్టారు అని చెప్పారు ఆమె తండ్రి. మోదీజీ మన్ కీ బాత్ లో ప్రశంసించారు. ఇంతకీ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదువు తున్న ఆకర్షణ  చేసి న పనేమిటోతెల్సా?తను సేకరించిన పుస్తకాలతో లైబ్రరీలు ఏర్పాటు చేయడం.ఎం.ఎన్.జె.కాన్సర్ హాస్పిటల్ కి  అమ్మా నాన్నలతో కల్సి వెళ్లింది.అక్కడ చిన్నారుల బాధ చూసి వారి కోసం పుస్తకాలు చదివేహాబీ తో కాసేపు ధ్యాస మారుతుంది అని లైబ్రరీ పెట్టింది. పుస్తకాల్లో మస్తకం దూరిస్తే ఆనందం చెప్పలేము.అలాలైబ్రరీ ఏర్పాటు తో వెలుగులు  చిమ్ముతూ మనకి ఆదర్శంగా ఉంది. మనం కూడా వార్తలు సేకరించి పుస్తకంలో రాసి చదువు తుంటే ఆ ఆనందం వేరు సుమా!
చంద్ర యాన్ లోవిక్రమ్ లాండర్లో ఆమె పాత్ర కీలకం.అలాగే ఆదిత్య  ఎల్1 లో కృషి చేస్తున్న బొల్లు మానస గుంటూరు జిల్లాలోని అమృత లూర్. చంద్ర యాన్ 2 విఫలం ఐనా నిరాశపడక3తో ఆనందం పొందిన నిధిశర్మది అసోం.12ఏళ్ళుగా ఇస్రోలో  పనిచేస్తూథియేటర్ ఆర్ట్స్ లో డిప్లొమా చేసిన సైంటిస్ట్.
చూట్టానికి చిన్న పని అన్పిస్తుంది కానీ అది ఆమెను కోటీశ్వరురాలిగా మార్చింది. ఆస్ట్రేలియా కి చెందిన సెరీన్ లిమ్.  గోళ్లమీద జెల్తో అతికించే స్టిక్కర్స్ తయారు చేసి ఫ్యాషన్ ప్రపంచం లో కొత్త ప్రయోగం చేసింది. జెల్లే అనే ఆస్టిక్కర్తో గోళ్లకి రంగుల డిజైన్ ఆకర్షణ త్వరగా తీసేయవచ్చు.మనంనుదుట బొట్టు బిళ్లలు వాడుతున్నాం కదా? అలాగే గోళ్లకి స్టిక్కర్స్!    
టీచర్ గా పనిచేసిన గోవిందు థెరిసా  విద్యార్థులకు స్కాలర్ షిప్ 200మందికి పైగా ఇచ్చారు. ఏడాదికి దాదాపు  3లక్షలు ఖర్చు పెడుతూ కొన్ని కుటుంబాలకు ఇల్లు కట్టుకోటానికి సిమెంటు ఖర్చు భరించారు.  కంటి ఆపరేషన్స్ బోరువేయించటం చేసిన ఆమె స్వస్థలంయాదాద్రి భువనగిరి జిల్లా లోని ధర్మారం.ఇండియన్ రెడ్ క్రాస్ జిల్లా డైరెక్టర్ గా పనిచేస్తున్నారు 🌹

కామెంట్‌లు