మధ్య ప్రదేశ్ కి చెందిన ఆదిత్య తివారీ అనేపదేళ్ల బుడత ఆర్మీదుస్తుల్లో ట్రాఫిక్ రూల్స్ పైస్వంతంగా పాటలు కట్టి జనాన్ని చైతన్య పరుస్తున్నాడు.అతన్ని పోలీసులంతా ట్రాఫిక్ సోల్జర్ ఆఫ్ ఇండియా గా ముద్దుగా పిలుస్తారు.రోజూ ఉదయం 6 కి ఇంట్లో నించి బయలుదేరి బస్సు ఎక్కి రాత్రి 8 కి ఇల్లు చేరే ది.హాస్టల్లో ఉండే స్థోమత లేదు. డిగ్రీ లో 85/100 మార్కులు ఆపైన పి.జి.కి 2బస్సులు మారి చదివి న బెంగుళూరు కి చెందిన వినుత బంగారు పతకాలు నగదు బహుమతులు పొందటం స్ఫూర్తి దాయకం.అమ్మ నాన్న టెన్త్ మాత్రమే చదివారు
అమెరికా లో పుట్టి పెరిగిన పావిరాల ప్రీతికా కూచిపూడి సంగీతం నేర్చుకుంది.హైదరాబాద్ లో స్థిరపడ్డారు అమ్మ నాన్న లు. ఇక వైతాళిక ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఫ్రీగా డాన్స్ సంగీతం నేర్పుతుంది. చేర్యాల మాస్క్ లు హస్తకళలు తో మొదలైన ఆమె సేవ ఇతరపల్లెలకు వ్యాపించింది.సౌందర్యసాధనాల తయారీ కళాఖండాల ప్రచారం చేపట్టి శిక్షణ కూడా ఇస్తోంది.
పర్యావరణ పరిరక్షణ తోపాటు ఉపాధి కల్గిస్తున్నారు పూనమ్ రక్షిత రాధిక.పండగలప్పుడు పూలను నీటి లో చెరువులో వదులుతాం.వాటివల్ల నీరు అపరిశుభ్రంగా మారుతుంది. అందుకే గుడులలో నుంచి పూజముగిశాక పడేసే పూలను సేకరించి రసాయనాలువాడకుండా ఆర్గానిక్ ఊదుబత్తీలుకోన్స్ తయారు చేసి అమ్ముతున్నారు. కాలేజీ లో చదువు తూ ఈపనికి పూనుకున్నారు స్నేహ్ ధనూక రక్షిత జాంజిరే.
యు.పి.కి చెందిన ఐఏఎస్ దుర్గాశక్తి నాగ్ పాల్ గోబర్ దియాతో మహిళలకు ఉపాధి కల్పించారు.ఆవుగేదే పేడతో పిడకలుచేసి ఎండినాకవాటి ని పొడిచేసిబంకమట్టి కల్పి ప్రమిదలుగా అమ్మ టంతోపాటు బూడిదను పంటలు మొక్కలకు ఎరువుగా వేస్తున్నారు. మనం కూడా ఇలాంటివి చేయొచ్చు కదూ?🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి