తల్లి ప్రేమ;- మొర్రిమేకల వినయ్- 8 వ తరగతి-జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మేళ్లచెరువు. 6305393291.
    ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు.ఆ రాజుకు ఒకరోజు పావురం పెంచుకోవాలనే ఆలోచన వచ్చింది. ఆ రాజే స్వయంగా తనే అడవిలోకి వెళ్లి పావురం తెచ్చుకోవాలి అనుకున్నాడు. అక్కడికి దగ్గరలో ఒక అడవిలో పావురం ఉండేది .పావురం పేరు ధరణి. తన చిన్న చిన్న రెండు పిల్లలతో ఉండేది.ఆ ధరణికి తన పిల్లలు అంటే చాలా ఇష్టం. వాటిని విడిచిపెట్టి ఉండేది కాదు. ఆ చిన్న చిన్న పిల్లలకు కూడా తన తల్లి అంటే చాలా ఇష్టం.
        ఒక రోజు అనుకున్నట్లుగా పావురం కోసం అడవికి వెళ్ళాడు రాజు.అక్కడ ఉన్న ధరణిని దాని పిల్లలను కూడా  చూశాడు. రాజు వెంటనే వలను వేశాడు.అది గమనించిన  ధరణి పైకి ఎగిరింది.కానీ తన  పిల్లలు చిన్నవి కావడంతో  ఎగరలేకపోయాయి. దానిని చూసిన ధరణి రాజు ముందు వాలి.. "రాజా.. నా చిన్న పిల్లలను విడిచి పెట్టండి"అని కోరింది.ఆ రాజు వెంటనే "నేను చాలా ఆశగా పావురాన్ని పెంచుకోవాలని వచ్చాను" అన్నాడు."నా పిల్లలను వదిలి వేయండి.వాటికి బదులుగా మీ వెంట నేను వస్తాను"అన్నది ధరణి. ఆ మాటలు విన్న పిల్ల పావురాలు "వద్దు.. మేమే మీతో పాటు వస్తాము మా తల్లిని తీసుకెళ్లకండి" అని బతిమాలాడాయి. తల్లీ,పిల్లల మధ్య ప్రేమను చూసిన మహారాజు మనసు మార్చుకున్నాడు. పావురాలను అక్కడే వదిలేసి వెళ్ళాడు. అప్పుడప్పుడు వచ్చి అడవికి వచ్చి పావురాలతో గడిపేవాడు. పావురాలు రాజుతో  స్నేహంగా మెలగసాగాయి.

కామెంట్‌లు