ప్రవర్తన;- బిచ్చాల బ్లెస్సి8వ,తరగతిజి.ప.ఉ.పా రామంచ

సిరికొండ అనే ఊరిలో ఒక రాజు ఉండేవాడు. అతని పేరు మహేష్, తన గొప్ప పరిపాలన గురించి తనరాజ్యంలోనే కాక, ఇతర రాజ్యాల్లో కూడా ప్రతిధ్వనించేది .తన రాజ్యంలో ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకునేవారు .నేను రాజుని అనే గర్వం లేకుండా మంచిగా మాట్లాడే వారు. పక్క రాజ్యంలో గంగాధర్ అనే సోమరి పొగరుబోతు అయిన రాజు ఉండేవాడు. అతనిని రాజ్యంలో ఇష్టపడేవారు లేరు మహేష్ రాజు గారిలో ఉన్న ఒక్క లక్షణం కూడా ఇతనిలో లేవు రాజ్యంలో ఏదైనా సమస్య వస్తే తర్వాత చేద్దాం అనేవాడు. ఇతర రాజుల ఎదుగుదలను చూసి ఓర్వలేదు. అయితే ఒక రోజు యుద్ధంలో మహేష్, గంగాధర్ రాజులిద్దరూ మరణించారు. మహేష్ రాజు గురించి అలాంటి  మంచి వారికి ఎందుకు అలా జరిగింది అని చాలా బాధపడ్డారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ఏడుస్తూ దీవించి శాంతిని కోరారు .ఇటు గంగాధర్ రాజు చనిపోయినందుకు అందరూ చాలా సంతోషంగా ఇలా అనుకున్నారు, రాజ్యంలో కష్టాలు వస్తే తీర్చలేడు ఇతరుల ఎదుగుదలను చూసి ఓర్వడు అతనికి తగిన శాస్తి జరిగిందని అందరూ ఆనందపడ్డారు అందుకే అంటారు మనం ఏ స్థాయిలో ఉన్నామని కాదు ఇతరులతో ఎలా నడుచుకుంటున్నాము అనేది కూడా ముఖ్యమే .మనకు దేవుడి దీవెనే కాదు మనుషుల దీవెనలు కూడా ఉండాలి అలా అయితే మనం సంతోషంగా ఉంటూ ఇతరులను సంతోష పెడుతూ ఉంటాము. ముఖ్యంగా మన జీవితం మరొకరికి భారం కాకూడదు
🙏🙏🙏🙏🙏
 
కామెంట్‌లు