తూరుపులో తొలి ఝాములో మైమరిపించు మలహరి
మరు ఝామున మనసు పాడేను భూపాలం
ఉదయించే భానుని వెండి కిరాణాల శుభాళి
మదిలో మెదిలెను ఆనంద భైరవి రాగం
సెలయేటి అలల గలగలల సవ్వడి తోడి
చిరుగాలి లో వినిపించేను మోహనరాగం
అందెల రవళులలో పలికేను హిందోళం
వాన చినుకులలో చిత్రంగా హంస నాదం
తొలి వలపు పిలుపుల శ్రీరాగా నికి
కన్నె మనసు పాడేది కళ్యాణిరాగం
జత కట్టిన సంతసాల వేళల శివరంజని
ప్రేమ జంటల యుగళగీతాలు అమృత వర్షిణి
మ్రోగేను ప్రతియెదలోమధుర రాగమాలిక
సందెకాడ గోధూళి వేళ వినిపించే భౌళి
వెన్నెలలోనిండు జాబిలి చెంత మేఘ రంజని
మనోహరముగా వినిపించు జావళీలు ఆభోళి
పవళింపు వేళ ఆలపించు జోలలు మధ్య మావతి
పరమాత్ముని కృపకై స్తుతించు శుద్ధ సావేరి
అమరత్వ ప్రాప్తికి శంకరాభరణమే శరణు
--//--
మరు ఝామున మనసు పాడేను భూపాలం
ఉదయించే భానుని వెండి కిరాణాల శుభాళి
మదిలో మెదిలెను ఆనంద భైరవి రాగం
సెలయేటి అలల గలగలల సవ్వడి తోడి
చిరుగాలి లో వినిపించేను మోహనరాగం
అందెల రవళులలో పలికేను హిందోళం
వాన చినుకులలో చిత్రంగా హంస నాదం
తొలి వలపు పిలుపుల శ్రీరాగా నికి
కన్నె మనసు పాడేది కళ్యాణిరాగం
జత కట్టిన సంతసాల వేళల శివరంజని
ప్రేమ జంటల యుగళగీతాలు అమృత వర్షిణి
మ్రోగేను ప్రతియెదలోమధుర రాగమాలిక
సందెకాడ గోధూళి వేళ వినిపించే భౌళి
వెన్నెలలోనిండు జాబిలి చెంత మేఘ రంజని
మనోహరముగా వినిపించు జావళీలు ఆభోళి
పవళింపు వేళ ఆలపించు జోలలు మధ్య మావతి
పరమాత్ముని కృపకై స్తుతించు శుద్ధ సావేరి
అమరత్వ ప్రాప్తికి శంకరాభరణమే శరణు
--//--
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి