స్వారాజ్యదినమంట
అన్నలో తమ్ములో
కంపెనోల్లు కత్కబెట్టి గెంటేసిన
దినమంట
కుత్కబంటి మెక్కినోల్లు కాల్మడ
తిప్పిరంట
మనదేసంపై పర్లు ఒస్తే గొట్టినట్టాయే
కూత్నిలు తెల్ల దొరలు కొల్లగొట్టినట్టాయే
మన రాజుల మస్కగొట్టి
యాపారం ఒంకబెట్టి
సుట్టమల్లె ఒచ్చినోల్లు
దెయ్యాలై పోయిరంట
సాపకింద నీరైతే సాకుజూసి
జోరైరి
దొంగబుద్ధోల్లు దొరదొరసానులైరి
పెయ్యసూస్తే తెల్ల దనం
గొయ్యి తీస్తే కుల్లుగునం
మన ఇంటనే దూరి మల్ల మనమీదనే పెత్తందనం
సీడపురుగుపీడబాయే
గాందీ తాత నీడబాయే
దేసబక్తులెందరియో పానాలు
గాల్లో పోయే
పులి పంజా ఈడిపోయే
మనదేశం మనదాయే
సొరాజ్యం మన ఇల్లని సక్కదిద్దుతున్నమంట
ఓటేసి పెద్దల ఎన్నుకుంటమంట
కస్టంలో బతుకంట
కల్సిమెల్సి ఉందమంట🌷
అన్నలో తమ్ములో
కంపెనోల్లు కత్కబెట్టి గెంటేసిన
దినమంట
కుత్కబంటి మెక్కినోల్లు కాల్మడ
తిప్పిరంట
మనదేసంపై పర్లు ఒస్తే గొట్టినట్టాయే
కూత్నిలు తెల్ల దొరలు కొల్లగొట్టినట్టాయే
మన రాజుల మస్కగొట్టి
యాపారం ఒంకబెట్టి
సుట్టమల్లె ఒచ్చినోల్లు
దెయ్యాలై పోయిరంట
సాపకింద నీరైతే సాకుజూసి
జోరైరి
దొంగబుద్ధోల్లు దొరదొరసానులైరి
పెయ్యసూస్తే తెల్ల దనం
గొయ్యి తీస్తే కుల్లుగునం
మన ఇంటనే దూరి మల్ల మనమీదనే పెత్తందనం
సీడపురుగుపీడబాయే
గాందీ తాత నీడబాయే
దేసబక్తులెందరియో పానాలు
గాల్లో పోయే
పులి పంజా ఈడిపోయే
మనదేశం మనదాయే
సొరాజ్యం మన ఇల్లని సక్కదిద్దుతున్నమంట
ఓటేసి పెద్దల ఎన్నుకుంటమంట
కస్టంలో బతుకంట
కల్సిమెల్సి ఉందమంట🌷
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి