నా పంచ పదుల సంఖ్య---
1011.
సుగ్రీవ స్నేహం,శ్రీరాముడు చేసే, ఆ వాలి సంహారము!
దుర్యోధనుడి స్నేహం కర్ణుడు, పాటించే జీవితాంతము!
కృష్ణకుచేలుల స్నేహం, యుగయుగాలకు ఆదర్శము!
ఆకాశాన ఆ "మిత్రుడు", కేవలం, పగలే ప్రకాశము!
భూమిపై ప్రాణమిత్రుడు ,
రేయి పగలు కోరుహితము, పివిఎల్!
1012.
స్నేహబంధము ఇగిరిపోని, మంచి గంధము!
ఏనాడు తెగిపోని,
మన హృదయబంధము!
కలియుగాన పలచన,
రక్త సంబంధము !
ఒక్కసారి ఏర్పడితే,
మహిలో శాశ్వతము!
అన్నీ మారచ్చు, మారకుండా, స్నేహమే నిలుచు, పివిఎల్!
1013.
సజ్జన సాంగత్యం జీవితాన, అవసరము!
తద్వారానే సంభవము, వ్యక్తిత్వ వికాసము!
దుర్జనసాంగత్యం,
పతనానికి సోపానము!
దుష్ట చతుష్టయ చేరిక,
కర్ణ వినాశము!
స్నేహం సరిగా ఎంచు,
మంచి జీవితం సాగించు ,
పివిఎల్ !
1014.
స్నేహం వెలిగే మణిదీపం, వరించిన దివ్య వరము !
స్నేహగీతి మధురాతి మధురం, పలుకు ఆధరము!
స్నేహశీలి జీవనం భద్రం ,
నడిచే దారి సుగమము!
సదాచారాన ఉత్తమం స్నేహం, జీవితాన సౌలభ్యము!
"స్నేహితుడి తోడు" ఆపదల్ని,
ఎదిరించే ధైర్యం ఇచ్చు,
పివిఎల్!
_________
సిరులకే సిరి! స్నేహసిరి!;- డా. పివిఎల్ సుబ్బారావు, 94410 58797.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి