నేను ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో చేరినప్పటి నుంచి నాకు సన్నిహిత గురువు నిజానికి నా జీవిత రథసారథి డాక్టర్ కె వెంకట్ రాజు గారు ప్రఖ్యాత ఆయుర్వేద వైద్యం చేపట్టినవారు తాను చదివింది చాలా తక్కువ అయినా భారత రామాయణ భాగవత భగవద్గీతలను అధ్యయనం చేసి జీవితాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి ఎవరితో ఎలా మాట్లాడాలి ప్రవర్తన ఎలా ఉంటే బాగుంటుంది అలాంటివన్నీ వారి దగ్గర నేర్చుకోవలసినదే వారికి తెలియని సాహిత్య ప్రక్రియ లేదు సాహిత్య సాంస్కృతిక ప్రియులందరూ ఆయన సన్నిహితులే నాకు తీరిక దొరికినప్పుడల్లా వారి దగ్గరికి వెళ్లడం సాయంత్రం పూట వారిని చూస్తూ ఉన్న సాహితీవేత్తలను పరిచయం చేసుకోవడం ఏదైనా కొత్త విషయాలు గురించి నేర్చుకొటo నిత్య కృత్యం అయిపోయింది.ఓ రోజు విశాఖపట్నం లో ఉన్న కళాకారులను గురించి మాట్లాడుతూ సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలలో చాలా వెనుకబడి ఉన్న సమయంలో అచ్యుతరామరాజు గారు ప్రధాన పాత్ర వహించి ఎవరి పేరుతోనో కాకుండా విశాఖపట్నం పేరుతోనే విశాఖ సాహితి సంస్థను స్థాపించి అనేకమంది శిష్య ప్రశిష్యులను తయారు చేయడం కూడా ఆయన ప్రతిభకు నిదర్శనం వారు రాసిన నాటకాలను వారే సహకరించి ప్రదర్శింప చేయడం ఒక కార్యక్రమంలో కథలు రాయటం లోను ఆ పాత్రల చిత్రణ కొత్తరకంగా ఉంటుంది మానసిక విశ్లేషణతో కూడినవి మాత్రమే అన్ని చర్చ కార్యక్రమం తర్వాత డాక్టర్ గారు వారి దగ్గర ఉన్న మున్న పుస్తకం అచ్యుతరామరాజు గారు రాసింది ఇచ్చి చదవమన్నారు.చదివిన తర్వాత మున్నా పాత్ర ఎంతో అద్భుతమైనదిగా అనిపించింది సామాజిక స్పృహ తోనే కథ కానీ నవల కానీ నాటకం కానీ వ్రాయాలి అన్నది వారి దృష్టి నేను మీ మాటల్లో మీ జీవితం అన్న శీర్షికను కొన్ని కార్యక్రమాలను ఏర్పాటుచేసిన సంగతి తెలిసిన డాక్టర్ గారు మీకు తగిన వ్యక్తి విశాఖపట్నం రాజుగారు వారి తో రికార్డ్ చేయమని చెప్పినప్పుడు నేను వెళ్లి వారిని కలిసి మాట్లాడి నేను చేయబోయే కార్యక్రమ విశేషాలను తెలియజేస్తే ఆయన ఎంతో ఆనందించాడు వెంటనే ఛాయా గ్రాహకుని కొన్ని పిలిచి దాదాపు మూడు గంటలు సంభాషణ రూపంలో కార్యక్రమాన్ని రికార్డు చేశారు అయినా నాకు తృప్తిగా లేదు రెండు సంవత్సరాలు తర్వాత మళ్లీ మా డాక్టర్ గారితో కలిసి వెళ్లి మరొక మూడు గంటలు రికార్డు చేసిన తర్వాత నాకెంతో తృప్తిగా ఉంది
=====================================
సమన్వయం ; - డా. నీలం స్వాతి
=====================================
సమన్వయం ; - డా. నీలం స్వాతి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి