ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 కళా ప్రపూర్ణ శ్రీ గణపతిరాజు అచ్యుతరామరాజు గారు  ఎలాంటివారు వారిచేసిన కృషి ఏమిటో ద్విభాష్యం రాజేశ్వరరావు గారు  చక్కగా చెప్పారు  వారు చెప్పిన వాటిలో కొన్ని విషయాలు  ఇండో రష్యన్ ఫ్రెండ్షిప్ సొసైటీ తరఫున సంరక్షణకు బయలుదేరి బృందంలో  సభ్యులుగా ఉన్నారు ద్విభాశ్యo కళాప్రపూర్ణ గారు  విశాఖపట్నం నుంచి బయలుదేరి కాజీపేటలో రైలు మారి సదరన్ ఎక్స్ప్రెస్ లో ఢిల్లీ చేరుకున్నారు  రాజుగారు విశాఖపట్నంలో చాలా పేరు పొందిన లాయర్ కొత్తద సర్కార్ జిల్లాల పట్టభద్రుల శాసనసభ్యులుగా రాష్ట్ర సాహిత్య అకాడమీ జనరల్ కౌన్సిల్ మెంబర్గా  100 పైచిలుకు గ్రంథాలు పీటికలు రాసిన గొప్ప సాహితీవేత్తగా సుమారు 80 మంది సుప్రసిద్ధ కథకుడు నవలాకారుడు నాటక కర్తలు  గేయ రచయితలు సభ్యుడుగా ఉన్నటువంటి విశాఖ సాహిత్య కి అధ్యక్షునిగా  సుమారు 100 ఏళ్ల చరిత్ర గల విశాఖ నాటకం మండలికి వెన్నెముకగా నిలిచిన వారు రాజుగారు.రాజుగారు మంచి కథకుడు  వారు రాసిన మున్నా అనే కథకు ఆంధ్రజ్యోతి కథ పోటీలో  ప్రథమ బహుమతి వస్తే రాచకొండ శాస్త్రి గారు ఆ కథను గురించి చెబుతూ మున్నా అనే కథ ఒక మంచి ముత్యం దానికంటే మంచి ముత్యం మా అత్యుత్తరామరాజు గారు  అంటూ అభినందించారు ఢిల్లీ వెళ్ళిన తర్వాత అక్కడ సదరన్ హోటల్లో రష్యా వెళ్లే వీరి బృందానికి అందరికీ కూడా బస్సు ఏర్పాటు చేశారు అక్కడ నుంచి తాసిల్ బయలుదేరడానికి ఇంకా ఒకరోజు సమయం ఉంది ఆరోజు ఉదయం నుంచి సదరన్ హోటల్ కౌంటర్ దగ్గర నిలబడి ఓ అరగంట పాటు ఎవరెవరికో ఫోన్లు చేస్తూనే ఉన్నారు రాజుగారు  ఆ సమయంలో నేను లాంజ్ లో కూర్చుని ఉంటే సుమారు 40 ఏళ్ల ఒక ఆవిడ అక్కడికి వచ్చి ఎవరికోసమో నిరీక్షిస్తూ అక్కడ సోఫాలో కూర్చున్నారు.ఆమె ఒక ఒరియా రచయిత్రి అని అంతకుముందే ఎవరో చెప్పారు. సాకే రచయిత్రి ఎడల సహజంగా ఉండే వుత్సకతతో ఆవిడ దగ్గరికి వెళ్లి  ద్విభాష్యం వారు  తనను తాను పరిచయం చేసుకొని ఆవిడ అప్పటికే ఒరియా భాష లో అనేక కథలు నవలలు రాసి సుప్రసిద్ధులు అయ్యారని  ఆవిడ మాటల ద్వారా తెలుసుకున్నారు  ఆవిడ ఎంతో ఆప్యాయంగా చాలా గౌరవంగా మాట్లాడారు ఆవిడ పేరు ప్రతిభా రే  ఆమె కూడా రష్యా సందర్శించే బృందం లో ఉన్నారట ఆవిడ రష్యా ప్రయాణంలో ఆవిడ ద్విభాశ్యo వారికి మంచి మిత్రురాలు అయ్యారు  తర్వాత ఆవిడ రాజేశ్వరరావు గారు కథలు కొన్ని కొరియాలోకి అనువదించారు కూడా  2013 లో ఆమె రాసిన యాజ్ఞ సేన అనే నవల కు జ్ఞానపీఠ అవార్డు లభించింది  ప్రస్తుతం జ్ఞానపీఠ కమిటీకి చైర్మన్గా ఉన్నారు ఆవిడ  ఈ లోపు ఫోన్ కాల్స్ అన్ని మాట్లాడి రాజుగారు నా దగ్గరికి వచ్చి సాయంకాలం నాలుగు గంటలకి తయారైగా ఉండండి  అన్నారు.
=====================================
సమన్వయం ; డా. నీలం స్వాతి 

కామెంట్‌లు