మురళీకృష్ణ గారి అమ్మాయి సూర్యకాంతం అది మురళి గారి తల్లి పేరు ఆమె విజయవాడ ఇచ్చినప్పుడల్లా ఏమ్మా మా గురువుగారి దగ్గరికి వెళ్ళావా? క్షేమ సమాచారం కనుక్కున్నావా అని అడిగేవాడు రెండు రోజులు వాళ్ళు ఇంట్లోనే ఉన్నానని సమాధానం చెప్పేది ఆమె నన్ను అన్నయ్య అని అరుణను వదినా అని పిలిచేది మా ఇంటి అమ్మాయితో కలిసిపోయింది అలా తుది శ్వాస విడిచే వరకు నన్ను మురళి గారు గురువుగారు అనే పిలిచేవారు అక్కడ అలా ఇచ్చినప్పుడు నేను ఎంతో సిగ్గుపడ్డా మనసులో మాత్రం గర్వపడ్డాను.సినీ రంగంలో మాకు ఆత్మీయ మిత్రుడు వీరయ్య గారు వారు పల్నాటి చిత్రం సినిమా తీస్తున్న సమయంలో సంగీత భరితం గా ఉండాలని ఎస్ రాజేశ్వరరావు గారిని సంగీత దర్శకుడుగా నియమించుకున్నారు అంతకుముందే ఘంటసాల వారికి పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది ప్రభుత్వం అది రాజేశ్వరరావు గారికి బాధగా ఉండి ఉండవచ్చు మనసులో దానిలో పాత్ర హరినాథ్ ఒక పద్యం పాడిoచడానికి దృశ్యం ఏర్పాటయింది ఆ పద్యం పాడడానికే ఘంటసాల వారిని నియమించారు మూడు పాదాలు బాగానే ఉన్నాయి నాలుగో పాదంలో మాత్రం ఘoగంటసాల పలకని చిన్న రాగాన్ని అతికించారు ఘంటసాల వారు పాడుతూ దాదాపు 17 సార్లు రికార్డు చేసినా అది రాజేశ్వరరావు గారికి నచ్చలేదు ఇంటికి వెళ్లి టీ తాగి వస్తానని చెప్పి ఘంటసాల వారు వెళ్ళిపోయారు.అప్పుడు నేను డాక్టర్ వెంకట్ రాజు గారు బయలుదేరి వెళ్లి బాలమురళీ గారిని కలిసి ఇదే విషయం చెప్పి మీరు పాడాలి అని అడిగితే ఘంటసాల మాస్టారు ఏమైనా అనుకుంటారేమో అన్నారు ఆయన కు ముందే చెప్పాను అని ఒక చిన్న అబద్ధం కూడా ఆడాను సరే మాతోపాటు వచ్చారు రాగానే రాజేశ్వర రావు గారు ఆత్మీయంగా ఆహ్వానించి విషయం చెబితే ఫస్ట్ టేక్ లోనే ఓకే చేశారాయన అలాంటి ప్రజ్ఞావంతుడు బాలమురళి గారు తెలుగు నాట పుట్టి కర్ణాటక సంగీతాన్ని ఆపోసన పట్టి నాద వినోదాన్ని సంగీతాభిమానులకు పంచిన గాన గంధర్వుడు పద్మ విభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు వారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం
.=========================
సమన్వయం ; డా. నీలం స్వాతి
.=========================
సమన్వయం ; డా. నీలం స్వాతి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి