సంగీత రాజధానిలో అడుగుడి మద్రాసు మకాం మార్చి రాయిపేట మ్యూజిక్ అకాడమీ దగ్గరలోనే ఇల్లు కట్టుకొని ప్రత్యేకoగా మద్రాసులో జరిగే సంగీత ఉత్సవాలకు తప్పకుండా పాల్గొనేవారు అక్కడే కర్ణాటక సంగీత కచేరీలు వందల సంఖ్యలో నిర్వహిస్తూ వచ్చిన బాలమురళీకృష్ణ కు వైలెన్ విద్వాంసులు ద్వారం వెంకటస్వామి నాయుడు అంటే ఎంతో అభిమానం సంగీత వాయిద్యాలు మీద కూడా పట్టు సాధించారు కొంతకాలం తిరుమల తిరుపతి దేవస్థానానికి శృంగేరి పీఠానికి బెజవాడ కనకదుర్గ దేవస్థానానికి ఆస్థాన విధ్వాంసునిగా కూడా బాలమురళీకృష్ణ వ్యవహరించేవాడు మద్రాస్ నగరం కర్ణాటక సంగీతానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చేది కావడంతో బాలమురళీకృష్ణ ఎన్నో కచేరీలు చేసి కర్ణాటక లలిత గీతాలు హిందుస్తానీ భజనలు కీర్తనలు వినిపించి తమిళ సంగీత అభిమానులకు ప్రీతి పాత్రుడయ్యారు.సంగీత సామ్రాజ్యంలో బాలమురళీకృష్ణ సాధించని కొలువులు లేవు స్వయంగా కొన్ని కొత్త రాగాలకు రూపకల్పన చేసి సంగీత బ్రహ్మగా ఖ్యాతి గడిo చారు వాటిలో మహతి లవంగి ధరణి ప్రతి మధ్య భారతి రోహిణి కాళిదాస మనోరమ సర్వ శ్రీ సిద్ధి గణపతి వంటివి కొన్ని మాత్రమే అమ్మ ప్రేమకు దూరమైన బాలమురళి సూర్యకాంతి పేరుతో ఒక కొత్త రాగాన్ని సృష్టించి తల్లికి నీరాజనం పలికారు వాడుకలో లేని పునరుత్ జీవనం కల్పించారు బాలమురళీ మద్రాసులో కట్టుకున్న గృహానికి మహతి అనే పేరును పెట్టుకున్నారు మహతి నారదుల వారి వీణ తమిళ్లో ఆయనను త్యాగరాజ అంశగా భావిస్తే తెలుగు ప్రజలు అన్నమయ్యగా రామదాసుగా ఆరాధించారు క్రమంగా అమెరికా కెనడా బ్రిటన్ రష్యా ఇటలీ సింగపూర్ శ్రీరంగం మలేషియా వంటి విదేశాలలో కచేరీలు చేయడం మొదలుపెట్టి దాదాపు పాతికవేల కచేరీల రికార్డులను సృష్టించారు.ఎన్నో సత్కారాలను సన్మానాలను అందుకున్నారు జుగలబంది తరహా కచేరీలకు రూపకల్పన చేసి పండిట్ జగ్మోహన్ జోషి పండిట్ హరిప్రసాద్ చౌరాసియా లాంటి పండితులతో జుగల్బందీలను నిర్వహించారు సంగీత కళానిధి గాన కళా ప్రపూర్ణ జ్ఞాన శిఖామణి జ్ఞాన సరస్వతి గాన కవిస్తుత నాదమహర్షి గాంధర్వ గాన సామ్రాట్ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలను ఎన్నిటినో అందుకున్నారు కర్ణాటక సంగీతానికి ఆత్మబంధువై నిలిచారు కేవలం గాన గంధర్వుడి గానే కాదు రంగస్థలం మీద కూడా రాణించినట్లుగా బాలమురళీకృష్ణ ఒక సంగీత విద్వాంసుడి నేపద్యంలో నిర్మించిన సంధ్య గిదేనా సింధూరం అనే మలయాళ చిత్రంలో హీరోగా దర్శనమిచ్చిన బాలమురళి చాచంద అనే బెంగాలీ సినిమాలో మేఘ సందేశం తెలుగు సినిమాలలో కొంచెం సేపు దర్శనమిచ్చారు భక్త ప్రహ్లాద సినిమాలో నారదుడిగా ప్రధాన పాత్ర పోషించారు.
--------------------------------------------------------
సమన్వయం ; డా. . నీలం స్వాతి
--------------------------------------------------------
సమన్వయం ; డా. . నీలం స్వాతి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి