ఏవి మెయ్యప్పన్ శెట్టియార్ గారు భక్త ప్రహ్లాద సినిమా నిర్మించ తల పెట్టినప్పుడు నారద పాత్రకు గాత్ర దానం ఇవ్వవలసిందిగా మురళి ని కోరితే, బాలమురళి ఆ పాత్రను తనే వేస్తానని అడిగిమరీ నటించారు అందులో ఆది అనాదియు నీవే దేవా నీవే కావా వరమోసగే వరమాలీ నా వాంఛితము నెరవేరునుగా సిరిసిరి లాలి చిన్నారి లాలి నోముల పంటకు నూరేళ్ల లాలి పాటలను సాలూరి రాజేశ్వరరావు సంగీత దర్శకత్వంలో బాలమురళి ఆలపించారు నేపథ్య సంగీత విషయానికొస్తే కొన్ని తెలుగు తమిళ కన్నడ మలయాళం సినిమాలో పాటలు పాడారు బాల మురళి మద్రాస్ ఆకాశవాణి కేంద్రంలో పనిచేస్తున్నప్పుడు 1957లో అలనాటి నటీమణి ఎస్ వరలక్ష్మి కటారి నాగభూషణం దర్శకత్వంలో సతీ సావిత్రి సినిమా నిర్మించింది ఆమె కొంత కాలం సంగీతాభ్యాసం చేసింది ఆ సినిమా లో సత్యవంతుడుగా నటించిన అక్కినేని నాగేశ్వరావుకు నేపథ్యగానం చేయవలసిందిగా బాలమురళిని కోరింది.ఆ సినిమాలో వరలక్ష్మితో కలిసి బాలమురళి మూడు యుగళగీతా లను ఐదు పద్యాలను పాడారు ఓహో విలాసాల కోవెలనో చందమామ దాగిన వేళా ఎందుకో ఈ ఆనందం ఏనాటిదో అనుబంధం అనే మూడు పాటల కు స్వరపరిచి పాడడం విశేషం 1962 లో విడుదలైన స్వర్ణకవి సినిమాలో నారద పాత్ర పోషించిన నరసింహారావుకు జై జై నారాయణ అనే పాటను పాలించు ప్రభువుల పసి పాపలను చేసి అనే పద్యాన్ని వెంకట్రాజు సంగీత దర్శకత్వంలో ఆలపించారు 1963 లో రాజ్యం పిక్చర్స్ వారి నర్తనశాల సినిమా కోసం సంగీత దర్శకుడు దక్షిణామూర్తి ఎన్టీఆర్ పోషించిన బృహన్నల పాత్రకు బాలమురళీ చేత లలిత రాధ శుధారస సారం పాటలు పాడించారు ఆ పాట నేటికీ రసజ్ఞులను అలరిస్తూనే ఉంది కర్ణ డబ్బింగ్ చిత్రంలో సుశీల తో కలిసి నీవు నేను వలచితిమీ నందనమే ఎదురుగా చూచితిమి అనే యుగళగీతాన్ని కూడా పాడారు
బాల మురళి సినిమాల కోసం ఆలపించిన పాటల్లో ఏటి లోని కెరటాలు ఏరరు విడిచి పోవు ఉయ్యాల జంపాల చిత్రంలోను అందాల రాముడు చిత్రంలో పలుకే బంగారమాయెనా అందాలరామ అన్న పాటను శ్రీరామాంజనేయ యుద్ధం చిత్రంలో మేలుకో శ్రీరామ మేలుకో అన్న పాట గుప్పెడు మనసులో మౌనమే నీ భాష వో మూగమనసా అన్న పాట మేఘ సందేశంలో పాడనా వాణి కళ్యాణిగా అన్నది తెర తీయగరాదా తిరుపతి దేవరా అన్న పాట శ్రీ వెంకటేశ్వర వైభవంలో బాగా పాపులర్ అయినవిగా చెప్పవచ్చు ఎన్టీఆర్ నిర్మించిన శ్రీమద్విరాట పర్వ సినిమాలో బాలమురళీ చేత బృహన్నల పాత్రకు ఆడవే హంసగమన జీవితమే కృష్ణ సంగీతము పాటని పట్టు పట్టి పాటించారు స్వాతి చినుకులు అనే మలయాళ సినిమాలో పాడిన భజన గీతానికి ఉత్తమ గాయకుడిగా బాలమురళి అవార్డు అందుకున్నారు.
===================================
సమన్వయం ; డా. నీలం స్వాతి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి