ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో మొదటిసారి కళా ప్రపూర్ణ పొందినవాడు కవి రచయిత వింజమూరి శివరామరావు గారు వారి తర్వాత ప్రఖ్యాత రచయిత్రి లత అనబడే తన్నేటి హేమలతా దేవి గారికి వచ్చింది విజయవాడ కేంద్రానికి వచ్చిన మూడవ పురస్కారం పద్మశ్రీ తన మృదు మధుర గాత్రంతో ఆకాశవాణి కి పేరు ప్రఖ్యాతలు సాధించిన శ్రీరంగం గోపారత్నం గారికి వచ్చింది రత్నం గారు అన్నవరపు రామస్వామి గారి ని గురువుగా గురువు గారు అనే సంబోధిస్తూ ఉంటారు అలాంటి గురువు గారికి చాలా ఆలస్యంగా పద్మశ్రీ వచ్చింది ఈ పద్ధతిలోనే వారికి ప్రభుత్వం ద్వారా అనేక పురస్కారాలు బహుమతులు రావాలని కోరుకుంటున్నాను మేం చేరిన చాలాకాలం వరకు ఆకాశవాణి కేంద్రానికి ప్రయాణ సాధనాలు లేవు.దగ్గరలో ఉన్నవారు నడిచి వచ్చేవారు కొంతమంది సైకిల్ మీద కొంతమంది రిక్షా మీద వచ్చేవారు రామస్వామి గారు మొదటి నుంచి సైకిల్ వాడేవారు అది లేకపోతే రిక్షాలో వచ్చేవారు వారు వయోలిన్ తో సైకిల్ మీద వచ్చి దిగ్గానే నేను కానీ లింగర జశర్మ గారు కానీ ఎదురుగా వెళ్లి వారి వయోలిన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇచ్చేవారు కాదు ఇది నా జీవం నాతోనే ఉంటుంది నేనే తీసుకొస్తాను అనేవారు ఆ వాక్యం అంత మమకారం ఉండబట్టే అంత గొప్ప కళాకారుడయ్యాడు సంగీత వాద్య కార్యక్రమం ప్రారంభించడానికి ముందు తాను ఏ కీర్తనలు ప్రారంభించబోతున్నారో వాటిని వరుసగా రాసి ఇవ్వడం అనేది సంప్రదాయం నేను వెళ్లి కీర్తనలు చెప్పండి అని అడిగితే ఆనంద్జీ నేను కీర్తనలు చెప్పడం ఏమిటి మీకు ఏ కీర్తన వినాలనిపిస్తే ఆ కీర్తన చెప్పి మీ ముచ్చట తీర్చుకోండి ఆ కీర్తనే నేను వాయిస్తాను అనేవారు.
================================
సమన్వయం ; డా . నీలం స్వాతి
================================
సమన్వయం ; డా . నీలం స్వాతి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి