తను నేర్చుకున్న కీర్తన మీద ఎంత పట్టు ఉంటే ఆ మాట అనగలరు అలాంటి మహా విద్వాంసుని ప్రక్కన ఉద్యోగం చేయడం మా అందరి అదృష్టం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో సంగీత కార్యక్రమాలలో ప్రతిష్టాత్మకంగా చెప్పుకోదగినవి దక్షిణ భారత సంగీత సభా కార్యక్రమం ఒకటి రాగం తానం పల్లవి రెండవది ఈ రెంటిలోను ప్రధాన ప్రావీణ్యం వున్న రామస్వామి గారికి వారి వయోలిన్ వాయిద్యం ప్రక్క వాయిద్యం వుండి తీరవాల్సిందే ఇలా అన్ని రేడియో కేంద్రాలలోనూ అన్నవరపు రామస్వామి గారు ప్రఖ్యాతి చెందారు ఏకం సత్ విప్రo బహుదా వదంతి అన్నది ఉపనిషత్ వాక్యం తన ఐదవ సంవత్సరంలో గురువుగారిని ఆశ్రయించి ఉచితంగా నేర్చుకున్న విద్య మొత్తాన్ని అనేక మందికి ఉచితంగా నేర్పాల్సిన బాధ్యత నాకున్నది దానిని నెరవేర్చుకుంటున్నాను అని చెప్తారు రామస్వామి గారు.బాలమురళి గారికి చిన్నతనం నుంచి వ్యాపారాత్మక దృష్టి లేదు ఆకాశవాణిలో పనిచేసినప్పుడు కానీ సంగీత కళాశాలలో ఉన్నప్పుడు గాని తన విద్యలో ఉన్న మర్మాలను శ్రోతలకు తన వద్ద శిష్యురికం చేస్తున్న పిల్లలకు తెలియజేయాలన్న ఆలోచన తప్ప మరొకటి లేదు చిన్నతనంలో దత్తాడ పాండురంగరాజు పి సూర్యరావు రమణమూర్తి బృందంతో కలిసి గోలీలాడుకున్న సందర్భాలు మిగిలిన వారిలా సంగీతం నేర్చుకోవాలని కృత నిశ్చయం కానీ దానిపై మనసు బెట్టి గురు సుష్రూష చేయడం కానీ వారికి చేయాలనిపించదు పూర్వ జన్మ సుకృతం వల్ల ఎన్నో జన్మల సాధనవల్ల పోత పోసిన సంగీత విగ్రహం మన బాలమురళి అని చాలా మంది చెబుతూ ఉంటారు.భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలోనే కాక ప్రపంచ దేశాలలో అనేక చోట్ల తన గాత్రాన్ని వినిపించారు చెన్నై వెళ్లిన తరువాత లాల్గుడి జీ జయరామన్ గారితో పరిచయం ఏర్పడి వారు ప్రక్క వాద్య సహకారణంగా అనేక ప్రాంతాలలో సహకరించారు పలు సందర్భాల్లో బాలమురళి గారికి విపరీతమైన పేరు రావడానికి కారణం ఆయన గొంతు కాదు నా వయోలిన్ అని చెప్పుకునే వారు ఆ విషయం చివరకు మురళి గారి చెవినపడింది అసలే మురళి గారు అంటే చిలిపి అని అర్థం వారిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే సహకార వాక్యాలలో ఎవరికి ఏ స్వరం పలకదో దానిని పసి కట్టడం జై రామన్ బలహీనత వారికి తెలుసు ఆ స్వరాలను వాడే సరికి తాను చేసిన తప్పుకు క్షమాపణలు చెప్పి మరెప్పుడు అలా చేయను అని ప్రమాణం చేశాడు ఆ తర్వాత ఎప్పుడు వారి సహ వాద్యం ను వాడుకోలేదు బాలమురళి గారు.
================================
సమన్వయం ; డా. నీలం స్వాతి
================================
సమన్వయం ; డా. నీలం స్వాతి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి