దాశరథి డా.దాశరథిరంగాచార్యులు 96 వ జయంతి;- "పద్యప్రవీణ" ; "సాహితీసన్మిత్ర" కట్టరంజిత్ కుమార్-తెలుగుభాషోపాధ్యాయులు-సిద్ధిపేట-చరవాణి :- 6300474467
 01.
సీ.
"గద్యదాశరథి"గఖ్యాతిగాంచియుతాను
"అభినవవ్యాసుడై"యవనినిలిచి
రామాయణమ్మును;రసరమ్యవేదాలు
సరళవచనముగాసంస్కరించి
అనువాదమునుజేసియందరిమెప్పించి
విద్వత్కవీశుడైపేరువడసి
చిల్లరదేవుళ్లు"శేముషీమొదలగు
నవలలురచియించెనాణ్యతగను
తెలగాణసాయుధతీవ్రంపుపోరులో
పాల్గొన్నధీశక్తిపండితుండు
మాటతీపిదనముమాధుర్యమొప్పార
భాషించిధీరుడైవాసికెక్కె
(ఆ.వె.)
అన్న"దాశరథి"కిమిన్నగాతోడ్పడి
మామ"వట్టికోట"నేమములను
విడువకుండనడిచి,విప్లవశంఖనా
దమ్ముజేసిత్యాగధనుడునయ్యె!!!




కామెంట్‌లు