నేను స్వతంత్రుడను
నేను ఎవరినీ దేబిరించి
నేనడగను
నేను స్వయంపోషకుడను
నేను నా స్వశక్తినే
నమ్ముకున్నవాడను
నేను శక్తి యుక్తి యుండి
చేతగాదనే సోమరులకు
బద్ధశత్రువును
నాకు దాపరికం
ఏమిలేదు
అంతా ఖుల్లంఖుల్లం
జీవితమంటేనే జీవిస్తూ వెళ్లడం
కష్టాలు కన్నీళ్లు ఇక్కడ సహజం
ఆత్మవిశ్వాసం నేనెప్పుడూ కోల్పోను
అతి విశ్వాసంతో నేనెప్పుడుండను
నేను నలుగురికి
ఆదర్శప్రాయున్నీ కాకపోవచ్చు
కానీ
నేను వాస్తవికతతో బ్రతకడం నేర్చినవాడను
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి