నేను ధర్మవైపునిలబడతానని
అబద్ధం ఆడడం నాకు చేతగాదని
ఈ దోపిడీ సమూహం నన్ను వెలివేసింది
వాస్తవిక జీవితాల్ని గడపమనివేడుకున్నా
నా మాటకు నా చేతలకు విలువే లేకుండా చేసి
నన్నో అనామకున్నిచేసింది
నాకు నా కన్న తల్లిదండ్రులు
అన్నదమ్ములు అందరూ ఉన్నారు
కానీ
నేను అనాథనే ?!
నేను నోరున్నా
గొంతెత్తలేని మూగవాణ్ణైనా
నన్నుబ్రతకనేర్వనోడా
అని అంటుంది
ఈ అసమ సమాజం
సమసమాజం కాంక్షించే
నన్నూ
అనాథంటారా?!
సత్యం వైపు నిలిచే నన్నూ
చేతగానివాడంటారా?!
ఇంకెన్నాళ్ళిలా ?!
దోపిడీ మంత్రం
జపిస్తారు
అమాయకులంతా
సోయికొస్తున్నారు
అప్పుడీ దోపిడీకోరుల
దుష్ట పన్నాగాలు,
వారి దుర్మార్గాలు
బట్టబయలవుతాయి
అధర్మం వైపు నిలిచిన మోసకారులు
తోకలు ముడుస్తారు
ఎంత కాలం నిప్పును గుప్పిట్లో
దాస్తారు
ఎంత కాలం అబద్ధాన్ని నిజంగా
నమ్మిస్తారు
భ్రమలన్నీ తొలగిపోతాయి
నిజం మా ఇజమనే రోజులొస్తాయి
నిజం
వాస్తవిక వాదమై బ్రతుకుల్నీ
వెలిగిస్తుంది
అసత్యపు (అబద్ధపు )పేకమేడలు
కుప్పకూలిపోతాయి
సత్యమేవ జయతే అని
అందరూ నినదిస్తున్నారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి