మనిషి కి మరణం తప్పదు
మరీ మనీ మీద యింత యావెందుకో?!
ఒంట్లోని ఆత్మదీపంఎప్పుడు
ఆరిపోయేది?
మనిషికి ఎరుకేనా?!
పోగేసిన ధనమంతా?!
తన నడుముకు కట్టుకొని రుద్రభూమికి పోతడా ఏంది?!
ఏందో !ఈమనీ !జీవన వ్యాపారాల నిమిత్తమే
మనీ అవసరం .
కానీ?
పోగేయడానికి కాదు!
సగటు మనిషి ఆయుర్దాయం
65సంవత్సరాలు
అదీ నోరు కాపాడినోడికే?!
కానీ ?
కండ్లపడ్డదల్లా తినేటోడు
ముందే పుటుక్కుమంటడు
లేనోడు !కంటినిండా నిద్ర
ఒక ఆకలి దేవులాట తప్పితే
ఏబాధుంది ఆడికి
తుండుగుడ్డపరిచి
బజార్ల నైనా పడుకుంటడు
ఉన్నోడు ఉన్నది కాపాడుకోలేక
అది బ్లాక్ మనీ అయితే వైట్ చేయలేక
ఒక్కొక్క సారి
అడ్డంగా దొరికిపోయి
జైల్లో చిప్ప కూడు తింటడు
ఎందుకు చెప్పు ?!
యిదంతా?!
ఉన్ననాడు తిని ?లేని నాడు
ఉపాసమున్నా ?ఫర్వాలేదు ?
కానీ
కాని పనులుచేయోద్దు
పుట్టినప్పుడు ఏమన్నా?! వెంటతీసుకొస్తిమా?!
రేపు పోయేటప్పుడు ఏమన్నా?!
తీసుకుపోతమా?!
పోగేసిన మిగుల ధనమంతా
పంచు
పుణ్య సంపద పెంచు
సర్వేజనా సుఖినోభవంతు!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి