అన్నాన్ని వృధా చేయకండి;- అంకాల సోమయ్య-దేవరుప్పుల- జనగాం -9640748497
అన్నాన్ని వృధా చేయకండి
అన్నార్తులకు దానం చేయండి

అన్నదానం ఆకలిని తీరుస్తుంది
ఆత్మారామున్ని చల్లబరుస్తుంది
అన్నం పరబ్రహ్మ స్వరూపం
విందు, వినోదకార్యకామాల్లో
మిగిలిన అన్నం, స్వీట్స్,  పులావ్
అనాథవృద్దాశ్రమాలకు పంపండి, వారికి
ఒక పూట 
పోషకాహారం అందించండి

శ్రీమంతులైన తల్లిదండ్రులు తమ పిల్లల
పుట్టిన రోజు వేడుకలను
మురికి వాడల్లో జరుపుకుంటామని
నిర్ణయం తీసుకోండి

ఫంక్షన్ హాల్లో జరిగే ఆహార వృధాను
అరికట్టండి బర్త్ డే నాడు
కేకులు ,బిస్కెట్లకయ్యే ఖర్చుతో
ఆ మురికివాడల్లోని పిల్లలకు
నోట్ బుక్స్, పెన్నులు, పుస్తకాలు
కొనివ్వండి వారి చదువులకు
ఆసరా అవ్వండి
ఈ రకంగా సామాజిక సేవా
పసితనం నుంచే పిల్లలకు అలవర్చండి
ఏది అనవసర ఖర్చు 
ఏది అవసరమైనది అనే విషయాన్ని వారంతట వారే
తెలుసుకొనే వీలుకల్గించండి

ఒక కిలో ధాన్యం పండించడానికి
 ఐదువేల లీటర్ల నీరు
అవసరం పడుతుంది
ఆ కిలో ధాన్యం రైతు పండించాని ఆరునెలలు
కాలం పడుతుంది
రైతు ఎండనకా,వాననకా
శక్తి వంచన లేకుండా కష్టపడతారు
అందుకే మనం ఆహార వృధాను అరికడదాం
రేపుఏర్పడేఆహారోత్పత్తుల
కొరతకు మనం కారకులం కాకూడదు

ఏదేశంలో నైతే కుక్క కూడా
ఆకలితో చావదో
ఆదేశం అన్నపూర్ణగా
వర్థిల్లుతుంది

సర్వే జనా సుఖినోభవంతు
ఓం శాంతి శాంతిః
ఓం శాంతి శాంతిః

(ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా వ్రాయడం జరిగింది ఈ కవిత)





కామెంట్‌లు