అమ్మ కడుపు పంటలం
అమ్మ పెంచిన మొక్కలం
అమ్మ వేలు పట్టి నడిచిన వాళ్లం
అమ్మ కొంగు చాటునెదిగినట్టి బిడ్డలం2
అమ్మ రూపురేఖలం
అమ్మ ధైర్య సాహసానికి వారసులం
అమ్మ జోల పాటకు శ్రోతలం
అమ్మఆటకు మేము వంతలం2
అమ్మ పూజకు నిబద్ధులం
అమ్మేదైవంగా కొలిచేటి వాళ్ళం
అమ్మ గల గల మాటలకు గాత్రాలం
అమ్మే దిద్దిన నడకలం బతుకు తోవ్వలం2
అమ్మేగా మా న్యాయదేవత
అమ్మేగా మా వెలుగు కాగడా
అమ్మేగా రేపటి మా కంటి
పాపా
అమ్మేగా మేం నిరంతరం జపించే తారక మంత్రం2
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి