సత్యం సతైనాష్ అయింది
అసత్యం దునియాను ఏలుతుంది
ఇక్కడ అమ్మా బాబు అంటు
యాచించడెవడు
గుట్టు చప్పుడు కాకుండా
గల్ల పెట్టెను దోపిడి చేయడమే
జుట్టు ముడేసుకొని
ఆహార్యం చూస్తే అదిరిపడిపోయేలా
బౌన్సర్లు
మేకల మంద మీద తొడేళ్ళదాడిలెక్క
ఇక్కడ బతకడం అంటే
సొంతదారులే అమ్మ బాబు అంటు
కిరాయి గుండాలు ,రౌడీలను
ప్రసన్న చేసుకొవలసిందే
ఇది పాడు కాలం
ఐకమత్యం
లోపించిన అడ్డగోలు కాలం
కసాయిలు తప్ప కరుణామయులు
బతకలేని
బద్మాష్ కాలం2
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి