మరీ ఎంతో కాదు సుమా
దూరం అలాగని దగ్గర కూడా
కాదు
కొలువలేనంత దీర్ఘం కాదు మరి పొట్టి రూపం కానేకాదు
దీని వేగం మాత్రం ముక్కుమీది కోపం కన్నా ఎక్కువే మరి
చిక్కంతా గమ్యం లేని అర్థంకాని సంచారం
శృతిలేని సంసార సాగరంలో అన్యాపదేశ ఆగమన సంకీర్తన శ్రవణ ఫలం కాబోలు
మనమనుకుంటాం గానీ ఇది ఎవరూ కలుపలేనిది కాదనీ చేతుల ప్రేమ అల్లుకున్న తీగ తీరు
నన్నూ ఆటపట్టించిన సందర్భాలెన్నో బాల్యచేష్టల పరాకాష్ట
అప్పుడు నాకు బాల్యం కేరింత అడుగులేసే నా మనుమరాలు ఆటపాటల మైదానంలో చిరు విరామమైనా
చిరునవ్వు పూలతోట దులుపుతుంది లేలేత విసురులో
తాతా! నాతోనే ఆడాలి పాడాలి అటూఇటూ పోవద్దు ఓ చిన్న ఫర్మానా వదిలింది
చిన్న విరామ చిహ్నమూ
మధ్యన దూరిన దూరం భావనే వాక్యంలో
మనసంతా
నిరంతర రక్తప్రసరణ లయ అమేయ విప్పారుతున్న బోసినవ్వుల గెలాక్సీ
కనిపించని చిన్న చుక్కంత దూరం
కూడా భరించలేనిది కలల బాల్యం
ఏంతో విలువైనది కదా బతుకులో
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి