వాడుక భాషా ఉద్యమ పితామహుడు "గిడుగు";--గద్వాల సోమన్న,9966414580
మన వెంకట రామమూర్తి గిడుగు
వ్యావహారిక తెలుగుకు గొడుగు
ఉద్యమం చేసి తెచ్చెను వెలుగు
అందరికి చేరువాయె తెలుగు

వ్యావహారిక భాష పితామహుడు
గిడుగు రామమూర్తి గారు ఘనుడు
తెలుగోళ్ల గుండెల్లో  ఉన్నోడు
అహర్నిశలూ పూజనీయుడు

చరిత్ర , శాసన పరిశోధకుడు
ప్రాముఖ్యంగా ఉపాధ్యాయుడు
మాతృభాష కొరకు పోరాడిన
ఆదర్శమూర్తి గిడుగు పిడుగు

రామమూర్తి జన్మ దినము నేడు
వీరికి సరి సాటి లేనేలేడు
వాడుక భాష తెలుగు అమలుకు
ఉద్యమించి గెలిచిన యోధుడు


కామెంట్‌లు