బంధము గుబాళించు గంధము;- -గద్వాల సోమన్న,9966414580
విలువైనది బంధము
సృష్టిలోనే అందము
చిన్ని సమస్యలతో
కాకూడదు దూరము

బంధాలకు విలువలు
ఇస్తేనే క్షేమము
మోదంతో బ్రతుకులు
అగును స్వర్గధామము

దండలో దారంలా
ఆధారం బంధము
నిత్యం కనుపాపలా
ఉంటేనే భద్రము

పవిత్రమైన బంధము
గుబాళించు గంధము
చిన్ని చిన్ని సమస్యలకు
విడిపోతే నష్టము

ఎన్నెన్నో బంధాలు
చూడంగా చిత్రాలు
మానవ మనుగడకవి
బలమైన స్తంభాలు


కామెంట్‌లు