పంతులమ్మ ప్రబోధ గీతి;- -గద్వాల సోమన్న,9966414580
కలహాలకు దూరము
ఉంటేనే క్షేమము
గుండెల్లో భారము
పెంచుకుంటే కష్టము

అందరితో వైరము
కాదు కాదు మంచిది
భగవంతుని సుగుణము
క్షమాగుణం గొప్పది

కలసిమెలసి ఉంటే
చేకూరును లాభము
విడిపోతే మాత్రం
గగనమంత నష్టము

విలువైన జీవితము
కాకూడదు వ్యర్థము
కావాలి సార్థకము
కాకుంటే హీనము


కామెంట్‌లు