.ఆట వెలది పద్యాలు
=================
వర్తకంబు జేయ వచ్చి తెల్లదొరలు
బానిసలుగ జేసె ప్రభువులనుచు!
రెండువందలేళ్ళు మెండుగ పాలించి
బాధలెన్నొ పెట్టి పట్టి చంపె! 1
పుణ్యభారతందు పురుడుబోసుకొనెను
వీర శూరులగుచు వేదమాత
నోర్పు నేర్పుతోడ నోలలాడించుచు
నాంగ్లదొరలయాట నాపబూనె!2
రౌద్రులగుచు చెలగె శత్రుల దునుమాడి
స్వేచ్చ వాయువొసగె శీఘ్రముగను!
స్వేచ్చ భారతికిక స్వీయముగ నుదురు
వీరతిలక మలదె వేడ్కతోడ! 3
స్వచ్చ భారతొడిన సంబరాలును నేడు
సాగుచుండె నహహ సవ్యముగను!
భరత మాత గర్భ వరపుత్రులనుచును
వీరగాథలెన్నొ వెలుగు చుండె! 4
విశ్వమందు కీర్తి విస్తరించగ శాంతి
పాదుగొల్పదలచె పావనముగ
చేయుచుండె ప్రభుత చేవగ పండుగన్
భారతీయ స్వేచ్చ భాగ్యమలర! 5
✍సట్లపల్లి (బొమ్ము) విమల
తెలుగు భాషోపాధ్యాయురాలు
జి.ప.ఉ.పా.హైతాబాద్
షాబాద్...మండలం
రంగారెడ్డి...జిల్లా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి