కోడ్ భాష( సేకరణ.. అచ్యుతుని రాజ్యశ్రీ)

 టెర్రరిస్టుల కోడ్ తెల్సుకునే టార్గెట్ చేసి పట్టుకునే ఏకైక ఉపాయం కోడ్ భాష.దీన్ని అర్థం చేసుకోటానికై  కలకత్తాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ఐ.ఎస్.ఐ. అనేక మంది నిపుణుల్ని తయారు చేస్తోంది.ఈసంస్థలోని రిసెర్చ్ లాబ్  మనిషి మెదడు నే ఓ ఆయుధంగా మలుస్తోందని చెప్పొచ్చు.
క్రిప్టోగ్రఫీ చదవటానికి బుర్రనే ఆయుధంగా ఎందుకు మలచాలి? దాని అవసరమేంటి?26.11.2008లోముంబై పేలుళ్ల కేసులో పాల్గొన్న టెర్రరిస్టులు నోటితో పలికే కోడ్ భాషను భారత గూఢచారి శాఖ అర్థం చేసుకోలేక పోయింది.టెర్రరిస్టుల ఆగమన సమాచారం తెల్సింది కానీ వారి సాంకేతిక పదాల్ని గ్రహించలేకపోయారు.అసలు దాడికి ఏడాదికి ముందే జాతీయ గూఢచారి శాఖ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో వారి సాంకేతిక భాషను రికార్డు చేశాయి.ఉగ్రవాదులు  ముంబై తాజ్ పై దాడిచేస్తారని తెల్సుకో గలిగారు కానీ అది ఆగ్రా తాజ్మహల్ లేదా ముంబై తాజ్మహల్ అన్నది అంతగా అర్థం కాలేదు. అందుకేఆ సాంకేతిక భాషను అర్థం చేసుకోటానికైరాజచంద్రబసు పేరు మీద ఆర్.సి.బోస్ సెంటరాఫ్ క్రిప్టాలజీ అండ్ సెక్యూరిటీ శాఖను ఏర్పాటు చేశారు.క్రిప్టోగ్రాఫ్ రహస్యాన్ని అల్గోరిథం ద్వారా కనుగొనవచ్చు.ఉదాహరణకు ఆంగ్లం లో ఉన్న TAESJLFBEOPPO అనే ఈ అర్థంలేని పదంనిక్రిప్టోగ్రఫీ ద్వారా strike at noon అనే పదంగా తేల్చారు.ఇది కంప్యూటర్ గణితం ఐ.టీ.ల సంగమం.దీన్ని ముందుకు తీసుకు పోతున్న వ్యక్తి విమల్ రాయ్ దాని అధ్యక్షుడు కూడా.ఆగస్ట్ 2012నుంచి దీని పని ప్రారంభమైంది.ఇందులో రాణా బెనర్జీ శుభమయ మైత్రలు భాషా విశ్లేషకులు.ఈవిధానం బ్యాంకు గోల్ మాల్ కి కూడా చెక్ పెడ్తుంది.అసలు మొదటి ప్రపంచ యుద్ధంకి ముందే విదేశీ కార్యాలయాల్లో క్రిప్టోగ్రాఫ్ ని ప్రవేశ పెట్టారు.1896 లో రష్యన్ జార్   విదేశీ కార్యాలయాల్లో క్రిప్టాలజిస్టు సాయం తో జర్మనీ ఆస్ట్రియా బ్రిటీష్ సాంకేతిక సంభాషణలు వినేవాడు.బోల్షివిక్ విప్లవం తర్వాత క్రిఫ్టోగ్రాఫర్ లండన్ పారిపోయాడు.తొలి ప్రపంచ యుద్ధమప్పుడు అమెరికన్ సైన్యం లో కూడా ఇలాంటి పనికై ఒక ప్రత్యేక విభాగం ఏర్పడింది.రెండో ప్రపంచ యుద్ధసమయంలో నాజీ సైన్యం సాంకేతిక గూఢచారి రహస్యాల్ని అమెరికన్ క్రిప్టోగ్రఫీ నిపుణులు గుట్టు విప్పి బట్టబయలు చేశారు.ఆతర్వాతహిట్లర్ నాజీ సైన్యం దాసోహం అంది. జపాన్ నౌకాదళం సందేశాలను అమెరికన్ క్రిప్టో స్పెషలిస్టులు ముందే పరిష్కరించారు🌹
కామెంట్‌లు