సామాన్యంగా పల్లెలలో జీవితం చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది అందరూ సామరస్యంగా ఒక కుటుంబాల లాగా వరసలు పెట్టి పిలుచుకుంటూ ఆనందంగా కాలం గడుపుతూ ఒకరి పనులకు మరొకరు సహకరిస్తూ ఉంటూ జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఎవరైనా ఒక మంచివాడు ఎన్నో మంచి పనులు చేస్తూ ఉంటే అతని మంచి పనులను చూసి అతను చాలా మంచి పనులు చేస్తున్నాడు అని మనసులో అనుకుంటారు కానీ ఎదుటకు వచ్చి చాలా మంచి పని చేస్తున్నావ్ అని అడిగింది ఇస్తే మరిన్ని మంచి పనులు చేయడానికి అవకాశం వస్తుంది అన్న విషయాన్ని మరిచిపోతారు ఆ చేసే పనులలో ఏ ఒక్కటైనా తప్పుగా చేస్తే తెలియక దానిని భూతద్దంలో చూస్తూ అతనికి కూడా భూతద్దంలోనే చూపిస్తూ ఇలాంటి పనులు చేయడానికి నీవు మన గ్రామాన్ని నాశనం చేస్తున్నావు అని శాపనార్థాలు పెట్టడానికి ప్రతి ఒక్కడు తయారవుతారు ఇది మానవ సహజ తత్వం.రాత్రి నిద్రించడానికి ముందు రాగి పాత్రలో నీరు పోసి తెల్లవారి పరగడుపున దానిని తాగమని మన పెద్దలు చెబుతూ ఉంటారు దీనివల్ల శరీరంలో రోగ కారక క్రిములు ఉంటే అవి చనిపోతాయి మెదడు చురుగ్గా పనిచేస్తుంది ఇవాళ చాలామందికి థైరాయిడ్ వ్యాధి వ్యాపిస్తుంది ఈ నీరు తాగటం వల్ల థైరాయిడ్ గ్రంథి పనితనాన్ని పెంపొందిస్తుంది చర్మ రక్షణను అందిస్తోంది ముసలి తనo రాకుండా ముడతలు కనిపించకుండా ఉండడానికి జీర్ణ వ్యవస్థకు ఇది చాలా బాగా తోడ్పడుతుంది గుండె దడ కు కానీ క్యాన్సర్ లాంటి వ్యాధులు కానీ వచ్చే భయాన్ని తగ్గిస్తుంది కనక ప్రతి ఒక్కరూ రాత్రి నిద్రించే ముందు రాగి పాత్రను దగ్గర పెట్టుకుని దానినిండా నీరు పోసి ఉదయం లేవగానే పరగడుపున తాగే అలవాటు చేసుకోండి.స్త్రీల గుణాలను గురించి వర్ణించేటప్పుడు భూదేవి కున్నంత సహనం కావాలి అని అంటూ ఉంటారు పెద్దలు సహనాన్ని గురించి మాట్లాడవలసి వస్తే దీనికి లింగ భేదం లేదు సహజంగా సహనం ఎప్పుడూ కూడా చేదుగానే ఉంటుంది అయితే దాని ఫలితాలు మాత్రమే ఎంతో తియ్యగా ఉంటాయి నిరంతరం వెలిగే సూర్యుని చూసి చీకటి భయ పడుతుంది నిత్యం పనిచేసే శ్రామికులను చూసి ఓటమి భయపడుతుంది జీవితంలో భయం లేకుండా ఆత్మవిశ్వాసం ఉన్నవారు గొప్ప గొప్ప విజయాలను సాధిస్తూ ఉంటారు జీవితంలో ధనం కోల్పోతే కొంత కోల్పోయినట్లుగా భావించవచ్చు కానీ వ్యక్తిలో ఉన్న వ్యక్తిత్వాన్ని కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్టే అని భావిoచాలి అని పెద్దలు చెప్తారు.
--------------------------------------------------------
సమన్వయం ; డా. . నీలం స్వాతి
--------------------------------------------------------
సమన్వయం ; డా. . నీలం స్వాతి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి