అన్నా చెల్లెలి అనుబంధం.. జన్మజన్మలా సంబంధం.. జాబిలమ్మకిది జన్మదినం..కోటి తారకల కోలాహలం''…’ అంటూ సోదర సోదరీమణుల బంధం గురించి ఎంతో గొప్పగా వర్ణించాడు ఓ సినీకవి. అన్నా-చెల్లెళ్లు, అక్కా-తమ్ముళ్ల బంధానికి ప్రతీక ఈ రాఖీ పండుగ. రాఖీ పౌర్ణమి, రక్షాబంధన్, రాఖీగా పిలవబడే ఈ పండుగ సోదర సోదరీమణులు అత్యంత పవిత్రంగా, వారి బంధం పటిష్టంగా ఉండాలని జరుపుకునే పండుగ. తల్లిదండ్రుల తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగిన అనుబంధం వీరి మధ్య ఉంటుంది. నీకు నేను రక్ష..నాకు నువ్వు రక్ష అంటూ అమ్మలో మొదటి అక్షరం, నాన్నలో రెండో అక్షరం అన్న. సోదర సోదరీమణులు ఒకరికి ఒకరు అండగా ఉంటామని భరోసా ఇచ్చే పండుగ. మానవ సంబంధాలకు, అనుబంధాలకు ప్రతీకగా నిలిచే పండుగ ఇది.ఒకప్పుడు ఉత్తర, పశ్చిమ భారతదేశాలలోని ప్రజలు మాత్రమే అపూర్వంగా జరుపుకునే ఈ పండుగ ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రతీ ఒక్కరు జరుపుకుంటున్నారు. సోదరి తన సోదరుడికి రాఖీ కట్టి ఎప్పుడూ అన్న తనకు రక్షగా, తాను అన్నకు అండగా ఉండాలని కోరుకుంటుంది.తమ సోదరులందరూ ప్రతి ఒక్క పనిలోనూ విజయం సాధించాలని కోరుతూ.. వారు జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటూ ఎర్రని దారాన్ని తయారు చేసి చేతికి కడతారు. అదే సమయంలో వారికి ఏదైనా తీపి పదార్థం తినిపించి, వారి నుదుట వీర తిలకం పెడతారు. అనంతరం హారతి ఇచ్చి వారి క్షేమాన్ని కోరుకుంటారు. సోదరులు సైతం తమ సోదరికి జీవితాంతం ఎల్లప్పుడూ రక్షణగా ఉంటామని వాగ్దానం చేస్తారు.అలెగ్జాండర్ భారతదేశం వైపు దండయాత్రకు వచ్చిన సమయంలో పోరస్ అనే రాజు తనను అడ్డుకుంటాడు. అయితే ఆ సమయంలో ఆ రాజు భార్య రొక్షన తన భర్తను చంపొద్దని కోరుతూ ఓ లేఖతో పాటు ఒక పవిత్ర దారాన్ని అలెగ్జాండర్ కు పంపుతుంది. అది చూసిన అలెగ్జాండర్ ఆ రాఖీని గుర్తుంచుకుని ఆ రాజును చంపకుండా వదిలేస్తాడు అనేది ఒక కధనం. అదేవిధంగా ద్వాపర యుగంలో ఒక సందర్భంలో కృష్ణుడి చేతికి గాయమైనప్పుడు ద్రౌపది దేవి తన చీర చొంగును చింపి గాయానికి కడుతుంది. దీంతో దానినే రక్షగా పిలుస్తున్నారు. విష్ణవు భార్య అయిన లక్ష్మీ దేవి శ్రావణ పూర్ణిమ రోజున మహాబలి చేతికి రాఖీ కడుతుంది. సోదరిగా తన కోరిక మేరకు విష్ణువును వదలివేయమంటుంది. ఆమె కట్టిన రాఖీకి మెచ్చిన బలి శ్రీ మహావిష్ణువును ఆమెతో పాటు శ్రీ మహా విష్ణువును కూడా వైకుంఠానికి పంపేస్తాడు అన్నది మర్ఫొక కధనం. ఈ పండుగ రక్తం పంచుకుని పుట్టిన సోదరుల మధ్యే కాదు. ఏ బంధుత్వం ఉన్నా లేకపోయినా సోదరుడు, సోదరి భావనలతో రాఖీ కడుతూ తమ ఆత్మీయ అనుబంధాన్ని చాటుతున్నారు.కులలకు అతీతంగా జరుపుకునే పండుగ రాఖీ. సోదరులు బాగుండాలని, వారు అభివృద్ధి సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ సోదరీమణులు కట్టే రాఖీ. కేవలం రక్త సంబంధీకులకే కాదు సోదరసమానులైన వారెవరికైనా సరే కట్టొచ్చు.ఈ రాఖీని కట్టేటప్పుడు యేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః | తేన త్వామభి బధ్నామి రక్షమాచల మాచల || అన్న మంత్రాన్ని చదివితే మంచిది మరియు అన్ని విధాలుగా శుభం కలుగుతుంది.
రాఖీ పండుగ ప్రాశస్త్యం;- సి.హెచ్.ప్రతాప్

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి