శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం
అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనం.
ఇవి శ్రీమద్భాగవతాంతర్గతముగా చెప్పబడిన తొమ్మిది లేదా నవవిధ భక్తిమార్గములు గవంతుడి వైభవాన్ని వినడం వల్లనైనా, ఆయనను కీర్తించడం వల్లనైనా, మననం చేసుకోవడం వల్లనైనా, ఆయన పాదాలను సేవించుకోవడం వల్లనైనా, సేవించుకోవడం వల్లనైనా, అర్చించుకోవడం వల్లనైనా, వందనాలు అర్పించుకోవడంవల్లనైనా, దేవదేవుడికి దాస్యం చేయడం వల్లనైనా, ఆయనతో సఖ్యతతో మెలగడంతో నైనా, తుదకు ఆత్మనివేదనం ద్వారానైనా భక్తజనులు పునీతులు కావచ్చని పై శ్లోకం అర్ధం.భక్తి అనేది ఒక పవిత్రమైన భావన. మనుషులలో భక్తి భావన కలవారిని భక్తులు అంటారు. భక్తి అనేక రకాలుగా ఉంటుంది.
సంపూర్ణ శరణాగతి భావంతో భగవంతుని దివ్య చరణారవిందములనే సదా నమ్మి కొలవడమే పాదసేవనం.సమస్త ఐశ్వర్యములు కలిగి,సమస్త భోగభాగ్యములకు నిలయమైనటువంటి లక్ష్మి " సిరి ప్రధానము కాదు, హరి పాదసేవనమే ప్రధానమని లోకమునకు చాటి నిరంతర హరిపాదసేవ యందే తన జీవితమును అంకితము గావించుకొన్నది. సిరిని ఆశ్రయించి హరిని విస్మరించి దివ్యత్వమునకు దూరము కావడం మానవుని యొక్క లక్షణము కాదని నిరూపించినది.భగవంతుని సర్వావయవాలలో ప్రాముఖ్యం వహించినవి పాదాలు. వీటిని సేవించిన భక్తులకు భగవంతుని పవిత్రసేవ చేసుకున్న ఫలితం వస్తుంది. భరతుడు, గుహుడు మొదలైన వారు ఈ పాదసేవ ద్వారా ముక్తులైనారు.ద్గురువులు, మహాత్ముల పాదాలెంత పవిత్రమైనవో హిమాలయయోగులు అనే గ్రంథంలో ఓ మహాయోగి రామాగారికి చెప్తూ ఇలా అంటారు.. మహాత్ముల పాదాలెందుకు సేవించాలంటే... బ్రహ్మఙ్ఞానం పొందిన మహాత్ములు భగవంతునితో ఐక్యమై ఉంటారు... అలా ఐక్యమై భగవంతుని పాదాలచెంత తమ జీవితంలో సర్వస్వమూ అర్పిస్తారు.సామాన్యంగా జనాలు ఎదుట వారిని ముఖం చూచి పోల్చుకుంటారు, కానీ ఋషీశ్వరుల ముఖం ఇక్కడ ఉండదు, భగవంతుని చెంత ఉంటుంది . జనాలిక్కడ అతను పాదాలనే కనుగొంటారు.అందుచేత అతను పాదాలకి నమస్కరించాలి.పాదసేవనం అంటే పాదాలను కౌగలించుకోవటం, ముద్దడటమో, పాదాల చెంత తలను వాల్చడమో కాదు...అతను అనుసరించి చూపిన మార్గంలోనే నడవటం.రుత్మంతునిలా నిరంతరం స్వామివారి పాదాల చెంత మనం ఉండలేకపోవచ్చు. లక్ష్మీదేవిలాగా ఆయన పాదాలను తాకలేకపోవచ్చు. కానీ ఆ పాదుకల మీద నిరంతరం మన ధ్యాసను నిలిపినా చాలు మనం తరిస్తామని శాస్త్రం చెబుతోంది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి