సుప్రభాత కవిత ; - బృంద
నిదురే లేని కనులకు
వచ్చిన కమ్మని కల
కమ్మిన మాయలో
చిమ్మిన కవనంలా

కుదురే లేని మనసున
అలలై పరుగులు తీసే
భాషంటూ లేని భావాల
అందమైన అనుభూతిలా

ఆకసమంటి  అంతరంగాన
అందంగా విరిసిన
అరుదైన రంగుల హరివిల్లులా
మురిపించే ముచ్చటలా

చీకటి మూసిన చిత్తాన
సరికొత్తగా వెలిగి
సుతిమెత్తని దారి చూపు
సిరి దీపపు వెలుగులా

చిరు కెరటాల కలంతో
తీరాన వరుస పంక్తులలో
కర్మసాక్షికి  కడలి వ్రాసిన
కమ్మని స్వాగత గీతికలా...

సింగారాలు ఒలికించు
బంగారు కాంతులతో
జలతారు జిలుగులు అద్ది
పలకరించు ప్రభాకరునికి

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు