మేలుకో! మేలుకో !
మేలుకో మేధావీ నిద్ర మేలుకో!
!!మేలుకో!!
జనశిక్షణ జనరక్షణ
జనజాగృతి చేయనెంచి
!! మేలుకో!!
పసిబాలల అభ్యున్నతి
బడుగు వర్గ అభివృద్ధి
గాంధి నెహ్రు కలలుగన్న
నవభారత నిర్మాణం
నీకు పరమ కర్తవ్యం
!! మేలుకో!!
జన జీవన ప్రమాణాలు
పెంచి పంచి హితము చేయ
సమత పెంచ నడుంకట్టు
దేశహితము అతిశయించ
!!మేలుకో!!
తాడిత పీడిత జనులకు
ఊత కర్రగానిలిచి
దైన్య హైన్య జనావళికి
భాసమాన హాసమేయ
!!మేలుకో!!
దివ్యభారతాంబ ఋణం
కొంతతీర్చి యశం పెంచి
మన రక్తపు చివరిబొట్టు
సిందూరం గావించగ
!! మేలుకో!!
****************************************
మేలుకో! ;- :- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
అభినందనలు! -రామతాత
అత్యద్భుతం! -రామతాత
-రామతాత.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి