పల్లవి::
ప్రేమ స్నేహం
ధైర్యం శౌర్యం
నీవై వెలిగిన
శ్రీకృష్ణా!
మానవ జీవన
సారం తెలిపిన
మూర్తివి నీవే
యదు కృష్ణా!
"ప్రేమ"
చరణం:::
మోదం నాదం
మోహన రూపం
నీవై వచ్చిన
శ్రీకృష్ణా!
మధురం గానం
మురళీ నాదం
నీవని తెలిపిన
యదు కృష్ణా!
"ప్రేమ"
చరణం::
నాట్యం గమనం
నవరస హృదయం
నీవై వచ్చిన
శ్రీకృష్ణా!
చందన గంధం
చల్లని బంధం
నీవని తెలిపిన
యదు కృష్ణా!
"ప్రేమ"
చరణం::
రేపల్లె వాడకే
రేడుగ నిలిచిన
నల్లనివాడా
యదు కృష్ణా!
వేణువు నీవై
రవళిత పదమై
జగతి నిండిన
శ్రీకృష్ణా!
"ప్రేమ"
చరణం::
నందం నగమై
నగవుగ వచ్చిన
దేవకి నందన
శ్రీకృష్ణా!
నంద యశోదల
నందుడు నీవై
ఆనందం పంచిన
యదు కృష్ణా!
"ప్రేమ"
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి