కుదమకు కేంద్ర ప్రభుత్వ హర్ ఘర్ తిరంగా ప్రశంసాపత్రం

కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న కుదమ తిరుమలరావు కేంద్ర ప్రభుత్వం నుండి హర్ ఘర్ తిరంగా ప్రశంసాపత్రాన్ని పొందారు. ఇంటింటా జాతీయ జెండా ఎగురవేసి వందనం చేయాలని నిర్దేశించిన 
ప్రధానమంత్రి పిలుపు మేరకు స్పందించిన తిరుమలరావుకు ఈ ప్రశంసాపత్రం లభించింది.
కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వారిచే ధృవీకరించబడి, ప్రశంసిస్తూ తిరుమలరావుకు ఈ పత్రాన్ని పంపారు. తిరుమలరావు గతేడాది కూడా స్పందించగా ఇదే విధంగా ప్రశంసాపత్రాన్ని పొందారు. తిరుమలరావు కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నుంచి ప్రశంసా పత్రం పొందుట పట్ల రాజాం రచయితల వేదిక కన్వీనర్ గార రంగనాథం తదితరులు హర్షం వ్యక్తం చేసారు.
కామెంట్‌లు