వైవిధ్యం;- సాయి వేమన్ దొంతి రెడ్డి,-కుంచన పల్లి.
దీనికి ముఖ్య కారణం ఏమిటి అని ఆలోచించినట్లయితే ప్రజలు తాము చేసిన పాపకర్మల నుంచి విముక్తి పొందాలని  కాంక్షించడమే అనిపిస్తుంది  శాస్త్రీయంగా ఆలోచించినట్లయితే మనిషి తాను చేసిన పాప పుణ్య ఫలితాలను తప్పక అతను అనుభవించి తీరాలి అని చెప్తారు  మొక్కుబడులు వ్రతాలు దీక్షలు పుణ్యం కోసం ఆచరించవచ్చును కానీ  పాప పరిహారార్ధం అని శాస్త్రం మనల్ని హెచ్చరిస్తుంది  మానవ జన్మంతా దుఃఖమయమైనప్పటికీ ఏమాత్రం భయపడకుండా భగవంతుని తలుచుకుని సహనంతో అన్నిటినీ ఓర్చుపోవాలి అన్నది  హర్ష వచనం  మానసిక తృప్తి కోసం  దేవాలయానికి వెళ్ళవచ్చు తప్ప  స్వార్థంతో కాదు అని పెద్దల మాట.ఈ ఇంట్లో పిల్లలు ఎవరైనా  కడుపు నొప్పితో బాధపడుతూ వుంటే వాము నీరు ఇస్తుంది తల్లి అది తాగిన  రెండు మూడు గంటలలో  సాఫీగా విరోచనం కావడం  కడుపు నొప్పి తగ్గటం  జరుగుతుంది  అంతేకాకుండా దగ్గు జలుబు ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ తొలగిపోతాయి  కిడ్నీలో గాని  మూత్రాశయం లో కానీ రాళ్లు కలిగినట్లయితే అవన్నీ కూడా  క్షణాలలో కరిగిపోతాయి గ్యాస్ గాని ఎసిడిటీ సమస్యలు గానీ తడిచెరువు ఎడల నొప్పులు వాపులు తగ్గుతాయి  శరీరంలో కొవ్వు బాగా పెరిగిన వాడు దీనిని సేవించడం గనక  అలవాటుగా చేసుకుంటే అధిక బరువు తగ్గుతుంది  వీటన్నిటికీ మించి రక్తంలోని షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.మనం ఏదైనా శుభకార్యానికి వెళ్ళినప్పుడు అక్కడ  భోజన పద్ధతి చూసినట్లయితే కొంచెం విరక్తి కలుగుతుంది  సనాతన ధర్మంలో భోజనం  షడ్రుచులతో కలిసి ఉండాలి అని చెబుతారు  పంచభక్ష్యాలు ఉండేట్టుగా ఏర్పాటు చేసుకుంటారు గృహిణి వడ్డన చేస్తూ కొసరి కొసరి వడ్డిస్తూ  తృప్తిగా భోజనాలు చేసేవారు  కానీ ఇప్పుడు వచ్చిన అతిథుడు భోజనం చేస్తున్నారా లేదా అని కూడా  ఆ గృహస్తు అడగడు  ఎవరిని పట్టించుకోడు శాస్త్రంలో ఒక నానుడి  ఆకలి రుచి ఎరుగదు అని  ఎప్పుడు కడుపు మండుతూ ఉందో దానిని నింపుకోవడానికి ప్రయత్నం చేస్తాడు తప్ప  ఎలాంటి పదార్థాలు తీసుకుంటున్నాము అన్న ఆలోచన అతనికి రాదు.
================================
సమన్వయం ; డా. నీలం స్వాతి  

కామెంట్‌లు