జయహో ఆంధ్రమాత!;- డా. మురహరరావు ఉమాగాంధి
 జయ జయహో ఆంధ్రమాత ..
జయ  పునీత ఘన చరిత..
 లలిత  కళా విరాజిత..
అన్య భాషల  పూజిత.. 
అజంత భాషా శోభిత....
జయహో జయహో  జయహో..!


శాతవాహన  శౌర్యమై
 కాకతీయ సంగ్రామమై
 విజయనగర భువన విజయమై
అమరావతీ శిల్ప సౌందర్యమై..
 గోదారి గలగల కృష్ణమ్మ పరుగుల ..
 సిరి పంట జిలుగుల తెలుగు మిలమిల..

నన్నయ్య శ్రీనాధ పోతన..
శ్రీకృష్ణ దేవరాయ పెద్దనాదుల...
 నిష్టకవుల అష్టావధానుల...
వ్యాకరణ వర్ణన రాజిల్లు కళకళ... 

చేమకూర కందుకూరి,
రాయప్రోలు, గురజాడ,  జాడల..
 విశ్వనాధ,కృష్ణశాస్త్రి శ్రీశ్రీ ఆధునికతల 
సంస్కృతాంధ్ర సారూప్యమై సంస్కృతీ స్వరూపమై..
దేవభాషకి హారతి పట్టినది పొట్టి శ్రీరాముల త్యాగ నిరతి..


అన్నమయ్య అమృత ధారలు 
త్యాగయ్య ఘన రాగ కృతులు 
క్షేత్రయ్య శృంగార రస ఝరులు 
  జానపదులు జావళీలు..
పద్యమై, గేయమై వచనమై వాక్యమై..
 వందనంబై విజయ కేతనంబై.. 
దిగంతమంతా కాంతి వంతమై...
ఆ చదువులమ్మకు తెలుగు పూల అక్షరార్చన..🪷🪷🪷


కామెంట్‌లు