శుభాకాంక్షలు!! డా;- .ప్రతాప్ కౌటిళ్య
చీకటి ప్రయాణంలో వెంటాడుతున్న వెన్నెలకల 
అలల్లా పుట్టి తీరంలో గిట్టిన కెరటాలెన్నో 
ఊరట పొందుతున్నట్లుంది.!

లోతుల్లోకి ఇంకుతున్న ఆలోచనల్నీ
పడవ ప్రయాణంలో ఊరేగి నట్లు ఓదార్చుతున్నాను. 

అనంతం కొంత త్రాసులో తూచి సరిచేస్తూ 
నిండుగా నిండిన కుండల్లా కావడిలో మోస్తున్నాను. 

జారిపోతున్న సత్యాన్ని నిజాయితీగా వెనక్కి తోసి 
కాలం ఒళ్ళో నిదురపుచ్చుతున్నాను!!

ఎప్పటికీ విస్తరించని పదార్థాన్ని శూన్యంలోకి విసిరేసి 
కొసరి కొసరి ఊపిరి తీసుకుంటున్నాను.!!?

మౌనంగా స్పృశిస్తూ శబ్దాన్ని సృష్టించే తీగల్ని గొంతులో సవరిస్తున్నాను.!!!

గాలి మిశ్రమాన్ని విడగొట్టే గట్టి ఊపిరితిత్తుల పుట్టుకను గమనిస్తున్నాను.!!

గమనం వెనికే ఉన్నాను గమ్యం ఎంతో చేరుకున్నాను!!

వేలాడుతున్న నక్షత్రాల్నీ మొలకెత్తించే విత్తనాన్ని గాల్లో నాటుతున్నాను.!!

పారుతున్న నిన్నటి పగటిని నేటి చీకటి కౌగిట్లో బంధిస్తున్న కన్నీటి నదిని 
ఆహ్వానిస్తున్నాను.!!!

దగ్ధమైన దృశ్యాల్ని అద్దపు పొరల్లోంచి తొలగించే వెలుగుల కోసం వేచి చూస్తున్న 
నిద్దురను నేను!!!

తవ్వి తవ్వి పోగు చేసిన సంతోషాన్ని 
చింత-చితిమంటల్లో కాల్చేస్తున్న
మనసు మర్మం పసిగట్టిన శాంతి 
ఆరుబయట రహస్యం తల పగలగొట్టింది.!!

కాపలాకాస్తున్న జీవితం నిద్రలోకి జారుకుంది. 
కనిపించని గాలిలా పరిమళం ఒకటి మనసును మేల్కొలిపింది.!!!

మతిమరుపుల అనుభూతుల్ని బ్రతికిస్తూ 
పుట్టినరోజు జరుపుకుంటున్న 
నిన్నటికి నేటి శుభాకాంక్షలు.!!!!?

డా.ప్రతాప్ కౌటిళ్యా

కామెంట్‌లు