నూతన పద్యప్రక్రియ ;- దనాసి ఉషారాణి( సిరిరాగ)తిరుపతి
 నూతన పద్యప్రక్రియ 
కవులకు ఉషస్సూర్యపది మయూరి  బిరుదుతో సత్కారము
రూపకర్త ధనాసి ఉషారాణి
పద్య నియమాలు
నాలుగు పాదములు ఉంటాయి
ఇది పూర్తిగా పద్య పక్రియ
ప్రతి పాదములో వరుసగా నాలుగు సూర్య గణములు ఉంటాయి
3 మరియు 4 పాదములకు ప్రాస నియమo కలదు
మొదటి మరియు 2 పాదములో పదవ అక్షరoకుయతి మైత్రి ని కూర్చాలి
ఉషస్సూర్యపది 
కలము తోడు పాడి పలుక
మనసు లోని ప్రేమ తరమ
వలపు తోడు నిల్చు తలపు*       
ఇలను జూడ వెలుగు కలుపు                   
పద్య పక్రియ
ఉషస్సూర్యపది* 
రూపొందించినవారు
దనాసి ఉషారాణి
తెలుగు ఉపన్యాసకురాలు
శతకము పూర్తి చేసి బిరుదు పొందిన కవి శ్రేష్ఠులు
చదువె ఇడును  తెలివి ఛాత్ర
బడికి జనుము ఎపుడు ప్రతిభ
దొరుకు నీకు బడికి పదర
పెరుగు  జ్ఞాన మెపుడు బడిన
               వేణు గోపాల్ శర్మ
               తెలoగాణ   
                                                
కాసర్ల రామచంద్రo 
తెలంగాణ
వినరె దుష్ట జనులు మావి 
మంచి పలుకు లన్ని కుసుమ 
ములను  బోలు సుమధు రములు 
కలుగు చుండు మనసు నిలువ 

ఉషస్సూర్యపది
తిరుపతిరావు గండ్రేటి
విజయవాడ.
పెద్ద గాను పెరుగ నడిపి 
చదువు సంధ్య లన్ని  దలచ
ఘనత నీతి విద్య పెరుగు 
వినతి చేయు చుంటి సుమతి

కూని అంకబాబు 
నెల్లురూ
ఉషస్సూర్యపది 
 తరువు లేక భువి ఘనత 
       తరుణి లేని భర్త ఘనత 
       సూన్యమగును కాద యెరిగి 
       మాన్యులంత మసలవలయు 
 
    

కామెంట్‌లు