అమ్మ చేసె అందముగా.... మస్తా బులు నీకు...!
పాలుగారు బుగ్గలేమో...
ఎరు పెక్కెను, చూడగా చారెడేసికళ్లకు తీరుగ దిద్దిన కాటుక... ,
అందమైన నగుమోమున అలరెను , కస్తూరి తిలకము..!
సువర్ణా భూషణములు...
తలకు చుట్టిన పాగా...
పాగాలో నెమలీక...
ఇంత చక్కగా కృష్ణా... నీకే
అమరును గదయ్య...!
నిన్ను జూడ నా జన్మము
ధన్య మయ్యె నయ్య..!!
*******
చిత్ర స్పందన ..... కోరాడ నరసింహా రావు !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి